ఎలా చేద్దాం?: చంద్రబాబు 'కాపు రిజర్వేషన్లపై' పురంధేశ్వరి ఆరా
మాజీ కేంద్రమంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి గురువారం బీసీ సంఘం నేతలతో భేటీ అయ్యారు. బీసీ సంఘం అధ్యక్షులు శంకర రావు నివాసంలో భేటీ జరిగింది.
గుంటూరు: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి గురువారం బీసీ సంఘం నేతలతో భేటీ అయ్యారు. బీసీ సంఘం అధ్యక్షులు శంకర రావు నివాసంలో భేటీ జరిగింది.
రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పైన వారు చర్చించారు. ఇదే సమయంలో కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తోంది.

కాపులను బీసీల్లో చేరిస్తే నష్టం ఏమిటి? కాపులను బీసీల్లో చేర్చుకోవాలా, వద్దా? తదితర అంశాలపై చర్చించారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కమిటీ వేసిన విషయం తెలిసిందే.
కాపులకు నష్టం జరగకుండా బీసీలలో చేరుస్తామని టిడిపి ప్రభుత్వం చెబుతోంది. బీసీలు మాత్రం వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంఘం నేతలతో పురంధేశ్వరి భేటీ కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications