బాలయ్య గుండెల్లో నేను: పురంధేశ్వరి, పవన్‌పై మధు
కడప/గుంటూరు: తన సోదరుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ హృదయంలో తనకు ఎప్పుడు స్థానం ఉంటుందని మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం అన్నారు. బాలకృష్ణ తన సోదరి రాజంపేట నియోజకవర్గంలో ప్రచారం చేయడం లేదనే విషయం తెలిసిందే.
దీనిపై ఆమె స్పందించారు. బాలయ్య హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారని అందుకే అతను రాజంపేటలో తన తరఫున ప్రచారం నిర్వహించడం లేదని చెప్పారు. నందమూరి ఆడపడుచుగా బాలయ్య పైన తనకు చాలా ప్రేమ ఉందని చెప్పారు. అలాగే బాలకృష్ణ హృదయంలో తనకు స్థానం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ పైన సిపిఎం మధు
జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రాజకీయ అనుభవం లేదని లెఫ్ట్ నేత మధు గుంటూరు జిల్లాలో అన్నారు. ఉద్యోగం నుండి తొలగించిన తహసీల్దారులో పవన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీతో కలిసినంత మాత్రాన తాము తెలుగుదేశం పార్టీని మతతత్వ పార్టీలా భావించడం లేదని వ్యాఖ్యానించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోను సిపిఐతో కలిసే ప్రసక్తి లేదన్నారు.












Click it and Unblock the Notifications