కేసీఆర్‌పై పల్లె, బాబు ఇష్యూపై పురంధేశ్వరి: మత్తయ్యకు కోర్టులో ఊరట
హైదరాబాద్: ప్రమాదకరమైన, రాజ్యాంగ విరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటల మరాఠీ అన్నారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు మాట్లాడటంలో ఆయన ఘనాపాటి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆయన తాపత్రయం అంతా అన్నారు.
రెండు రాష్ట్రాల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోదు: కామినేని

రెండు రాష్ట్రాల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోదని, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున రెండు ప్రభుత్వాలకు హక్కు ఉంటుందని చెప్పారు.
సెక్షన్ 8 అమలు చేయకపోతే సెక్షన్ 5ను కూడా తీసివేయాలన్నారు. భారతీయ జనతా పార్టీ విలువలు కలిగిన పార్టీ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జరిగే పరిణామాల్లో నిజ నిర్ధారణ తర్వాతే కేంద్రం జోక్యం చేసుకుంటుందని మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి అన్నారు.
24 దాకా మత్తయ్యను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. 24వ తేదీ వరకు మత్తయ్య అరెస్టు పైన హైకోర్టు స్టే విధించింది. తన పైన నమోదైన కేసును కొట్టివేయాలని మత్తయ్య హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది.












Click it and Unblock the Notifications