సీమకు ఇప్పటి వరకు ఒకటే పరిశ్రమ, ఏపీ నుంచి ఒక్కటీ రాలేదు: పురంధేశ్వరి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికీకరణ అవసరం ఎంతో ఉందని బిజెపి జాతీయ మహిళా మోర్చా ఇంచార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం అన్నారు.

కోడుమూరులో ఆదివారం బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర కరవు ఏర్పడిందన్నారు.

నంద్యాల దెబ్బ, కొత్త కోణం: పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి రెచ్చిపోవడం వెనుక?

రాయలసీమకు ఇప్పటి వరకు కేవలం ఒక్క పరిశ్రమ మాత్రమే వచ్చిందని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి కేంద్రం ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ. 1,050 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.

Purandeswari says Rayalaseema should get more industries

ప్రజా ప్రయోజనాల నిమిత్తం కేంద్రం కృషి సించాయి యోజన ఏర్పాటు చేసిందని తెలిపారు. అందులో ఏపీ నుంచి అభివృద్ధికి సంబంధించి 8 అంశాలు రాగా అందులో రాయలసీమకు సంబంధించి ఒక్కటి కూడా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనధార అయిన పోలవరానికి జాతీయ హోదా కల్పించిన బిజెపి ప్రభుత్వం, దాని నిర్మాణం కోసం ఖర్చు అంతా ఇస్తుందన్నారు.

2018 కల్లా రాష్ట్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఆ తర్వాత తాగునీటి కష్టాలపై స్థానిక ప్రజలు ఆమెకు విన్నవించుకున్నారు. మహిళలు పట్టువస్త్రాలతో సత్కరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader and Former Union Minister Daggubati Purandeswari on Sunday said that Rayalaseema should get more industries.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X