వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం నిధులు రాకపోవడానికి ఏపీ సర్కారే కారణం: పురంధేశ్వరి విమర్శలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పురంధేశ్వరి వీలుచిక్కినప్పుడల్లా తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా, మరోసారి తెలుగుదేశం ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు.

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పురంధేశ్వరి వీలుచిక్కినప్పుడల్లా తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా, మరోసారి తెలుగుదేశం ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు.

 ఏపీ ప్రభుత్వం వల్లే..

ఏపీ ప్రభుత్వం వల్లే..

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం సరైన లెక్కలు చూపకపోవడం వల్లే రాష్ట్రానికి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని పురంధేశ్వరి అన్నారు.

 ఏపీ ప్రభుత్వం విఫలం

ఏపీ ప్రభుత్వం విఫలం

గురువారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ఆమె మాట్లాడుతూ.. కేంద్రం ద్వారా అందుతున్న నిధులకు లెక్కలు చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

 అలా చేస్తే నిధులు వచ్చేవి...

అలా చేస్తే నిధులు వచ్చేవి...

పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్లు మారుతున్న తీరును పురంధేశ్వరి తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల వివరాలు ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలిపితే నిధులు అదే స్థాయిలో వస్తాయని స్పష్టం చేశారు.

 రాజధాని విషయంలోనూ..

రాజధాని విషయంలోనూ..

రాజధాని విషయంలోనూ సరైన లెక్కలు చూపడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

English summary
BJP senior leader Purandeswari takes on at Andhra Pradesh government for not sending reports to central government, on used funds given by centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X