వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ పురంధేశ్వరిదే, కోపం రాదు వచ్చినా..: టిఎస్సార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari will contest from Vishaka: TSR
విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికలలో విశాఖ లోకసభ స్థానం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తారని, ఆమెకు తాను పూర్తి సహకారం అందిస్తానని రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామి రెడ్డి శనివారం నాడు చెప్పారు.

పురందేశ్వరి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. ప్రజల్లో తనకు ఇమేజ్ వుందని, ఈసారి లోక్‌సభకు పోటీ చేస్తానని ముందుగానే సోనియా గాంధీని కలిసి చెప్పానని అయితే, విశాఖ నుంచే పోటీ చేస్తానని పురందేశ్వరి అధిష్ఠానానికి చెప్పడంతో, ఆమెను ఇబ్బందిపెట్టకూడదనే తనను మూడోసారి రాజ్యసభకు పంపించారన్నారు.

తనకు ఎవరిపైనా కోపం రాదని, వచ్చినా అది కొంత సమయమేనని, అందుకే తాను అజాత శత్రువునయ్యానని చెప్పారు. తాను వివాదాస్పద వ్యక్తిని కానని, దైవాన్ని నమ్ముకున్న వాడినన్నారు. పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై వేసిన 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసును ఇప్పటికే ఉపసంహరించుకున్నానన్నారు.

ఏదేమైనా విశాఖతో ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరని, తాను ప్రారంభించిన అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. తాను కూడా అందరి మాదిరిగానే వెల్‌లోకి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశానన్నారు.

English summary
Rajya Sabha Member T Subbirami Reddy on Saturday said Union Minister Daggubati Purandeswari will contest from Vishaka in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X