పోటీకి కిరణ్ రెడ్డి దూరం: పురంధేశ్వరి నామినేషన్
హైదరాబాద్: కడప జిల్లాలోని రాజంపేట బిజెపి లోకసభ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి శనివారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు సహా పలువురు తెలుగుదేశం, బిజెపి నాయకులు పాల్గొన్నారు.అంతకు ముందు పురందేశ్వరి శనివారం ఉదయం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదిలావుండగా ఎన్నికలకు దూరంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

శనివారం ఉదయం చిత్తూరు జిల్లాలోని పీలేరు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కిరణ్ హాజరయ్యారు. పీలేరు నుంచి ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్)లో నామినేషన్లకు శనివారం చివరి రోజు. దీంతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications