చంద్రబాబుకు మంచి అవకాశం: ఓటుకు నోటు కేసుపై పురంధేశ్వరి
విజయవాడ: తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విషయంలో బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఆమె శనివారంనాడు సాక్షి మీడియాతో మాట్లాడారు.

ఓటుకు నోటు కేసులో నిర్దేషిత్వాన్ని నిరూపించుకునేందుకు చంద్రబాబుకు మంచి అవకాశం వచ్చిందని తాము భావించామని, అయితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక హోదాపై కూడా ఆమె స్పందించారు. సాంకేతికంగా ప్రత్యేక హోదా అనే పదం వాడలేకపోతున్నామే తప్ప అంతకు ఎక్కువే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు.
శనివారం బిజెపి పదాధికారుల సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదాపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications