చాలా ఉన్నాయి: ప్రత్యేక హోదాపై పురంధేశ్వరి ట్విస్ట్
విజయవాడ/ రాజమండ్రి: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా, పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని మాజీ మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో గురువారం జరిగిన బీజేపీ అభియాన్ సంపర్క్ సమావేశానికి ఆమె హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పురంధేశ్వరి చెప్పారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నేతలు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో పురంధేశ్వరి ఆ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి.
సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో నందినాటకోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్ అన్నారు. కళాకారులను ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని వారు అన్నారు.












Click it and Unblock the Notifications