రిలీఫ్ : పూరిజగన్నాథ్ కు ముందస్తు బెయిల్

హైదరాబాద్: భూవివాదం కేసులో ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ దంపతులకు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. బ్యాంకు తాకట్టులోని భూమి అమ్మి మోసం చేశారని పూరీ దంపతులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దాంతో ఇబ్బంది రాకూడదని ముందస్తు బెయిల్ ని పొందారు.

నాలుగు రోజుల క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లో ఆరేళ్ల క్రితం బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన స్థలంపై వివాదం ఏర్పడడం, రుణాన్ని చెల్లించకపోవడంతో పూరీ జగన్నాథ్‌ ఆయన భార్య లావణ్యపై పోలీస్‌ అధికారులు కేసు నమోదు చేశారు.

Puri Jagan takes anticipatory bail

పోలీసులు అరెస్ట్‌ చేస్తారేమోనన్న అనుమానంతో పూరీ జగన్నాథ్‌ గురువారం నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం అభ్యర్థించారు. కోర్టు సోమవారం వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కాగా తనను మోసం చేశారంటూ పూరీ జగన్నాథ్‌ బంజారాహిల్స్‌లో రాజు, మరో బిల్డర్‌పై ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించాక నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్... ఎన్టీఆర్ తో చిత్రం చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కరప్టడ్ పోలీస్ అథికారిగా కనిపించనున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+