ఘరానా లేడీ మోసం మరో మలుపు, గోల్డ్ కాయిన్స్ సీజ్

తమిళనాడు రాజధాని చెన్నైలోని గోల్డ్ క్వెస్ట్ గోడౌన్‌పై సిఐడి అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. గోల్డ్, వెండి నాణేలను స్వాధీనం చేసుకుని, వాటి విలువను లెక్కించేందుకు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులున్నట్లు కూడా సిఐడి అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే కాకుండా శ్రీలంకలో కూడా గోల్డ్ క్వెస్ట్ డైరెక్టర్లపై కేసులున్నట్లు సమాచారం. మలేసియా నుంచి పుష్పా అప్పలనాయుడు రాకెట్‌ను నడిపినట్లు తెలుస్తోంది. ఆమె 1125 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు సిఐడి అధికారులు గుర్తించారు.
గతంలో పుష్పా అప్పలనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె కోర్టుకు హాజరు కాకుండా ఎగవేస్తూ వస్తున్నారు. దీంతో సిఐడి పోలీసులు ఇంటర్‌పోల్ సాయం తీసుకున్నారు. గతంలో ఆమె నుంచి పోలీసులు 6 కిలోల బంగారం నాణేలను, కొన్ని కిలోలో వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications