నామినేటెడ్ పోస్ట్‌ల భర్తీ: టీటీడీ చైర్మన్‌గా పుట్టా, కిరణ్ రెడ్డి సోదరుడికి కీలక పదవి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం సహా పలు కార్పోరేషన్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం భర్తీ చేశారు. చాలా రోజులుగా వినిపిస్తున్నట్లుగా పుట్టా సుధాకర్ యాదవ్‌కు కీలక పదవి లభించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్‌ను నియమించారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా జూపూడి ప్రభాకర రావు, కాపు కార్పోరేషన్ చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్యలకు దక్కింది.

Putta Sudhakar Yadav new TTD chairman

చంద్రబాబు 17 కార్పోరేషన్లకు చైర్మన్‌లను నియమించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి కూడా పదవి లభించింది. ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్‌గా కిషోర్ కుమార్ రెడ్డిని నియమించారు.

ఎవరికి ఏ పదవులు అంటే?

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా దాసరి రాజా మాస్టారు, ఆర్టీసీ కడప రీజియన్‌ ఛైర్మన్‌గా చల్లా రామకృష్ణా రెడ్డి, ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ ఛైర్మన్‌గా పార్థసారధి, ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ ఛైర్మన్‌గా ఆర్వీ సుభాష్‌ చంద్రబోస్‌, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ ఛైర్మన్‌గా తెంటు లక్షుం నాయుడు, శాప్‌ ఛైర్మన్‌గా పి అంకమ్మ చౌదరి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దివి శివరాం, రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్‌ఎంజియావుద్దీన్‌, ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మహ్మద్‌ హిదాయత్, గొర్రెల పెంపకం అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా వై నాగేశ్వర రావు, కనీస వేతన బోర్డు ఛైర్మన్‌గా రఘుపతుల రామ్మోహన్ రావు, రాష్ట్రగృహ నిర్మాణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నామన రాంబాబు నియమితులయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu appointed 17 corporation chairmen. Putta Sudhakar Yadav new TTD chairman.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి