ఏపీకి గుడ్ న్యూస్- వైజాగ్ లో ఆ రెండు ఆస్పత్రులకు జాతీయస్ధాయి అక్రిడేషన్..
ఏపీలో తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయస్ధాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలోనే మొట్టమొటదిసారిగా విశాఖలోని 2 ఆసుపత్రులకు NABH అక్రిడియేషన్ లభించింది. GMCH (గవర్నమెంట్ మెంటల్ కేర్ హాస్పిటల్) మరియు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ ఛెస్ట్ డిసీజెస్ ఆసుపత్రులకు నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (NABH) అక్రిడేషన్ మంజూరు చేసింది.
క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) లోని ఓ విభాగం NABH. ఇది దేశంలోని ఆసుపత్రులు, హెల్త్ కేర్ సెంటర్స్, రక్తదాన కేంద్రాలు, ఆయుష్ ఆసుపత్రులు, వివిధ స్థాయిల్లో పనిచేసే హెల్త్ కేర్ యూనిట్లకు నాణ్యతా ప్రమాణాలను బట్టి గుర్తింపు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. సుమారు 10 చాప్టర్లు, 100 ప్రమాణాలు కలిగిన ఈ విభాగం 503 లక్ష్యాలతో పనిచేస్తుంది. ఆసుపత్రులు ఈ అక్రిడేషన్ కోసం ఈ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటాయి. కేంద్రం ఇచ్చిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి, వాటికి అక్రిడేషన్ ఇస్తారు. ఈ అక్రిడియేషన్ మూడేళ్లు ఉంటుంది.

NABH అక్రిడేషన్ పొందాలంటే ఆసుపత్రులు ఎనిమిది విభాగాల్లో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలి. ఈ ప్రమాణాల్ని విశాఖపట్నంలోని రెండు ఆస్పత్రులు అందుకున్నాయి. సర్వీస్ ప్రొవిజన్, రోగుల హక్కులు, ఇన్‌పుట్స్, సహాయక సేవలు, క్లినికల్ కేర్, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, నాణ్యమైన ఆరోగ్య సేవల నిర్వహణ, రోగి భద్రత విభాగాల్లో ఈ ప్రమాణాలు అందుకున్నాయి. వీటిని పరిశీలించిన బోర్డు రెండు ఆస్పత్రులకు అక్రిడేషన్ మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, PHC, UPHC, CHS, VHC లలో సైతం జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు (NQAS) ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సీఎం వైయస్.జగన్ ప్రజలకు ఆరోగ్య సేవలను అత్యుత్తమ ప్రమాణాలతో అందించాలని పలుమార్లు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఇందుకోసం నేషనల్ హెల్త్ మిషన్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హెల్త్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ప్రమాణాలు ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 537 ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రులు NQAS ప్రమాణాలను అందుకున్నాయి. 2023-24 సంవత్సరానికి 2,956 కేంద్రాలను ఈ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.












Click it and Unblock the Notifications