బాబుకు షాక్, టిడిపిలో చేరుతానని చెప్పానా: కృష్ణయ్య
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసిన బిసి సంఘాల నేత ఆర్. కృష్ణయ్య తాజాగా శుక్రవారంనాడు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. తెలంగాణకు బీసి నేతను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబును కలిసిన ఆర్. కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేకపోవడమే కాకుండా తాను టిడిపిలో చేరుతానని చెప్పానా అని అడిగారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని బిసీ నేతకు ఇవ్వాలని నేత ఆర్.కృష్ణయ్య శుక్రవారంనాడు డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు ఇవ్వాలన్నారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై కృష్ణయ్య మండిపడ్డారు. తెలుగుదేశంలో చేరతానని తాను ఎప్పుడైనా చెప్పానా అని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు.

ఇదిలావుంటే, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియానే తెలంగాణ ఇచ్చారని, అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన మీడియాతో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇచ్చిన మాట ప్రకారం తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని గజ్జెల కాంతం డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications