టీటీడీ ఛైర్మన్ రేసులో ఆ ఇద్దరు - సీఎం మొగ్గు ఎవరి వైపు..!!

టీటీడీకి కొత్త ఛైర్మన్ రానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఆగస్టు 12 తో కాలపరిమితి ముగియనుంది. ఎన్నికల కాలం కావటంతో సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకే వినియోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలో టీటీడీ నూతన ఛైర్మన్ ఎంపిక కసరత్తు మొదలైనట్లు విశ్వసనీయ సమాచారం. అందులో ప్రధానంగా ఇద్దరి పేర్లు రేసులో ఉన్నాయి. సీఎం నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.

టీటీడీకి కొత్త ఛైర్మన్ : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన బోర్డు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైవీ సుబ్బారెడ్డికి తొలుత టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. తొలి టర్మ్ పూర్తయిన తరువాత ఆయన్ను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం సాగింది. కానీ, రెండో సారి కూడా ఆయనకే టీటీడీ ఛైర్మన్ గా అవకాశం దక్కింది.

jagan11

ఇదే సమయంలో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను సీఎం అప్పగించారు. వచ్చే నెలతో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియనుంది. దీంతో కొత్త ఛైర్మన్..బోర్డు సభ్యుల ఎంపిక పైన కసరత్తు మొదలైంది. ప్రధానంగా ఇద్దరి పేర్లు రేసులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి..చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

సుబ్బారెడ్డికి ఎన్నికల బాధ్యతలు : అయితే, చెవిరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తుడా ఛైర్మన్ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగతున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. చెవిరెడ్డికి అన్నమయ్య, తిరుపతి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. దీంతో చెవిరెడ్డికి ఎన్నికల వేళ టీటీడీ ఇవ్వటం అనుమానంగానే కనిపిస్తోంది.

ఇదే సమయంలో బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణ‌మూర్తికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. జంగా వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ (యాదవ వర్గం)కు చెందిన నేత. పార్టీలోని బీసీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసారు. ఎమ్మెల్సీగా ఉన్నారు.

chevireddyvsjangakrishnamurthy

బీసీ నేతకు టీటీడీ ఛైర్మన్ పదవి : చెవిరెడ్డికి ఇవ్వటానికి సమీకరణాలు కూడా అడ్డుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు సుబ్బారెడ్డి ఛైర్మన్ గా కొనసాగటంతో అదే వర్గానికి వరుసగా మూడో సారి ఇవ్వటం సాధ్యపడదనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో ప్రతిష్ఠాత్మక టీటీడీ బోర్డు ఛైర్మన్ గా ఉండటంతో కొత్త విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం.

అదే సమయంలో ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ సుబ్బారెడ్డి పాత్ర కీలకం కానుంది. ఇక, బీసీ నేతకు టీటీడీ ఛైర్మన్ ఇవ్వాలనేది కొంత కాలంగా సీఎం జగన్ అభిప్రాయం. గతంలో టీడీపీ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. ఇప్పుడు వైసీపీలోని బీసీ నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జంగా కృష్ణ‌మూర్తి కి టీటీడీ ఛైర్మన్ గా అవకాశం దక్కటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+