వైసీపీకి అది చీకటి రోజు అవుతుందట

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోండటం లాంఛనప్రాయమే. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆమె సిద్ధపడ్డారు. ఈ నెల 4వ తేదీన దేశ రాజధానిలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

అనంతరం ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్ననారు. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా షర్మిల అపాయింట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

Raghu Rama Krishnam Raju made key remarks on YS Sharmila set to join in Congress

ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలను అప్పగించనుంది. కర్ణాటక, తెలంగాణల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే ఊపును ఏపీ రాజకీయాల్లోనూ తీసుకుని రావాలని భావిస్తోంది.

ఏపీలో పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకుని రాగలిగే సత్తా ఒక్క వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉందని నమ్ముతోంది కాంగ్రెస్ అధిష్ఠానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు.. స్వయానా ఆయన చెల్లెలు ఏపీసీసీ చీఫ్‌గా మరోవైపు పోరాటానికి దిగే వాతావరణం ఏర్పడుతుంది. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఏపీ రాజకీయాల్లో షర్మిల రాకను స్వాగతించారు. ఇదొక మంచి పరిణామంగా అభివర్ణించారు. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పగ్గాలను అందుకుంటే- రాష్ట్రంలో మైనారిటీ, క్రైస్తవ సామాజికవర్గ ఓటుబ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లుతుందని అంచనా వేశారు.

Raghu Rama Krishnam Raju made key remarks on YS Sharmila set to join in Congress

రాష్ట్రంలో 20 శాతానికి పైగా మైనారిటీ, క్రిస్టియన్ ఓటుబ్యాంక్ ఉందని, ప్రస్తుతం ఈ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్సీపీ వైపు ఉందని, దానికి గండి పడుతుందని రఘురామ అంచనా వేశారు. వైఎస్ షర్మిల.. కాంగ్రెస్‌లో చేరబోయే జనవరి 4వ తేదీ- వైఎస్ఆర్సీపీకి చీకటిరోజుగా మారుతుందని అన్నారు.

వైఎస్ఆర్సీపీలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులందరూ కాంగ్రెస్‌లో చేరుతారని అభిప్రాయపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దక్కేది 20 సీట్ల లోపేనని రఘురామ జోస్యం చెప్పారు. జగన్ అహంకార ధోరణే ఆ పార్టీ పతనానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+