ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఖరారు కాకపోయినా ఎన్డీయే అభ్యర్ధిగానే బరిలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి పక్షాలు భేటీ అయి రఘురామకు సీటు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా ఇవాళ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమిని బలపరచాలని ప్రజలను రఘురామ కోరారు. రాష్ట్రం మారాలని, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలన్నా లక్ష్యంతోనే మూడు పార్టీలు ఏకమయ్యాయన్నారు.
తన సిట్టింగ్ సీటు అయిన నరసాపురం స్థానం నుంచే తిరిగి పోటీ చేస్తానని చెప్పిన రఘురామకృష్ణంరాజు, తనకైతే న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటానని పేర్కొన్న రఘురామ.. తనకు న్యాయం జరుగుతుందని, జరగకపోతే న్యాయం జరిగేలా ప్రజలే చూస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్దాలను, చేస్తున్న దారుణాలను ప్రజలు గుర్తించి, రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు.

మరోవైపు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి 135 స్థానాలు రావచ్చునని రఘురామ కృష్ణంరాజు అంచనా వేశారు. గతంలోనే కూటమికి 135 స్థానాలు వస్తాయని తాను చెప్పానని, ఇప్పటికీ అదే చెప్తున్నానన్నారు. ఇందులో ప్లస్ 15 స్థానాలు, లేదంటే మైనస్ 15 స్థానాల తేడా మాత్రమే ఉంటుందని, అంతకుమించిన తేడా ఉంటుందని తాను భావించడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని, కచ్చితంగా చంద్రబాబు రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, నేనైతే ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా రఘురామ స్పష్టం చేశారు. రిజర్వుడు స్థానాలను మినహాయించి, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసినా తనను తాను పరిచయం చేసుకోవలసిన అవసరం లేకుండానే ప్రజలే రాజుగారు రండి అని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవసరం తనకు రాదని, ఒకవేళ ఆ అవసరమే వస్తే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి అయినా పోటీ చేయవచ్చునని చెప్పారు. కానీ నరసాపురం సీటే తనకు వస్తుందని ధీమాగా ఉన్నట్లు తెలిపారు.
ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిగా శ్రీనివాస్ వర్మ కు టికెట్ కేటాయించాలన్న బిజెపి నాయకత్వ నిర్ణయం ముదాహముని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక లోను ఇవే ప్రమాణాలను పాటించక పోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. రాష్ట్ర నాయకత్వం నివేదించిన తప్పుడు సమాచారం వల్లే తనకు టికెట్ లభించలేదని, అంతేకానీ కేంద్ర బీజేపీ నాయకులకు తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. ఇక్కడే ఏదో జరిగి ఉంటుందనేది నా భావన అని పేర్కొన్న ఆయన, రాష్ట్ర బిజెపి నాయకులతో గత నాలుగు ఏళ్ళు గా తనకు పెద్దగా సంబంధాలు లేవని చెప్పారు.
తన జాతక ప్రకారం రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందని చెప్పారు. ఎంపీ స్థానాన్ని పార్టీలు
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications