RRR: కూటమికి వచ్చే సీట్లు ఇవే-రఘురామ లేటెస్ట్-కౌంట్ డౌన్ మొదలు..!
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన భారీ పోలింగ్ శాతం అన్ని పార్టీల్లోనూ ఆశలు పెంచుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రస్తుతం గ్రౌండ్ సర్వేలు చేయించుకుంటున్నాయి. వీటి ఆధారంగా తమ లెక్కలు సవరించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్డీయే కూటమికి మద్దతుగా జోస్యాలు చెబుతున్న ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు తాజాగా ఇవాళ విజయనగరంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 నుంచి 135 సీట్లు సాధిస్తుందని గతంలో చెప్పిన రఘురామ.. ఇవాళ మాత్రం 120-125 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. కూటమి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటూ రఘురామ తెలిపారు. మరోవైపు ఈసారి వైసీపీ గెలవబోతోందంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను రఘురామ కొట్టిపారేశారు.

వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని రఘురామ తెలిపారు. వాస్తవానికి రాష్ట్రంలో మే 13నే ఓ పార్టీ చనిపోయిందని ఆయన తెలిపారు. ప్రజలు మే 13న వైసీపీని తిరస్కరించారరన్నారు. జూన్ 4న సీఎం వైఎస్ జగన్ కు దిమ్మతిరిగేలా ఫలితాలు రావడం ఖాయమన్నారు. ఫలితాలు చూసి ఆ రోజు వైసీపీకి పెద్దకర్మ నిర్వహించాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. జగన్ కు తాను మరో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్లు రఘురామ హింట్ ఇచ్చారు.
మరోవైపు ఈసార ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోందని ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రఘురామ చెప్పుకొచ్చారు. సీఎంగా జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తానని ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారని, ఆ ముహూర్తానికి వైసీపీ భూస్థాపితం అవుతుందని రఘురామ జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications