రఘురామకు చంద్రబాబు మార్క్ షాక్..?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లలో విజయం సాధించి కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాల్గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. అయితే మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో పదవుల పంపకంలో టీడీపీ నేతలకు మొండిచేయి ఎదురైంది.
గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, బండారు సత్యనారాయణ వంటి సీనియర్ నేతలకు మంత్రి పదవులు దగ్గలేదు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజుకు కూడా ఎటువంటి మంత్రి పదవి దక్కకపోవడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా విజయం సాధించిన రఘురామ కృష్ణంరాజు కొద్ది కాలానికే ఆ పార్టీకి దూరమయ్యారు.

నిత్యం వైసీపీ ప్రభుత్వ విధానాలపై రచ్చబండ పేరుతో సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే విచిత్రంగా ఆయనకు మూడు పార్టీలు.. టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి సీటు దక్కలేదు. ఆర్‌ఆర్‌ఆర్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు రేగడంతో చివరకు ఉండిలో అభ్యర్థిని తప్పించి మరీ చంద్రబాబు.. రఘురామకు సీటిచ్చారు. తీవ్ర పోటీని తట్టుకుని ఆయన విజయం సాధించారు. అయితే తనకు మంత్రి పదవి లేదా శాసనసభ స్పీకర్ పదవి అయిన దక్కుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు.
మంత్రి పదవి దక్కకపోవడంతో స్పీకర్ పదవి అయిన దక్కతుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే అయ్యన్నపాత్రుడు పేరు స్పీకర్ పదవికి గట్టిగా వినిపిస్తుండటంతో రఘురామ కృష్ణంరాజుకు మొండిచేయి ఎదురైంది. మరో వైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి , కొలుసు పార్థసారథిలకు మంత్రి పదవులు కేటాయించడంతో రఘురామ అభిమానులు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. మర మంత్రి పదవి దక్కకపోవడంపై రఘురామ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications