ఓడిపోయా: పోటీ నుంచి తప్పుకున్న కృష్ణంరాజు

నర్సాపురం టికెట్ తెచ్చుకోవడంలో తాను ఓడిపోయానని ఆయన అన్నారు. తన సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాని ఆయన చెప్పారు. తాను బిజెపి, తెలుగుదేశం కూటమితోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కొన్ని సంస్థల కారణంగానే తనకు టికెట్ రాలేదని ఆయన అన్నారు.
తనకు టికెట్ రాకపోవడం బాధించినా ప్రజల మద్దతు చూసి సంతోషం వేసిందని ఆయన అన్నారు. బిజెపి, తెలుగుదేశం కూటమికి నష్టం చేసే చర్యలకు పాల్పడబోనని ఆయన అన్నారు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ బిజెపికి వెళ్లింది.
నిజానికి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణం రాజుకు టికెట్ లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ, బిజెపి రంగరాజు పేరును ఖరారు చేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications