జనసేన నుంచి రఘురామ..!! లెక్క పక్కా- జగన్ ను ఓడించాలంటే : అంతా "సెట్" అయినట్లే..!!

ఏపీలో ఇప్పుడు నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక పైన హాట్ డిబేట్ నడుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే నెల 5వ తేదీ తరువాత తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు. వైసీపీ సైతం ఈ నిర్ణయం కోసమే వేచి చూస్తోంది. రఘురామ పైన అనర్హత వేటు కోసం ఇప్పటి వరకు ప్రయత్నించిన వైసీపీ.. అందులో ఇప్పటికీ సక్సెస్ కాలేదు. ఇక, ఇదే సమయంలో రఘురామ సైతం అనర్హత పైన వైసీపికి సవాళ్లు చేస్తున్నారు.

Recommended Video

    Elections 2024: TDP పొత్తు Pawan Kalyan క్లారిటీ YS Jagan ట్విస్ట్ | Oneindia Telugu
    సర్వేల ద్వారా బరిలోకి రఘురామ

    సర్వేల ద్వారా బరిలోకి రఘురామ

    తాజాగా, నర్సాపురం నుంచి తిరిగి పోటీ చేసి గెలవాలని భావిస్తున్న ఎంపీ రఘురామ ఒక ప్రముఖ సంస్థతో సర్వే సైతం చేయించుకున్నట్లు సమాచారం . అందులో తేలిన అంశాలే రఘురామ నిర్ణయానికి..ధీమాకు కారణంగా చెబుతున్నారు. తాజాగా, రఘురామకు ఏపీ సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత స్పందించిన రఘురామ తన గెలుపు ఖాయమని చెబుతున్నారు. తనకు.. సీఎంకు నర్సాపురంలో చాలా తేడా ఉందని.. గెలుపు గురించి ఆలోచన అవసరం లేదని చెబుతూ..తాను మెజార్టీ పైనే ఫోకస్ చేసానంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే రఘురామ నర్సాపురంలో పోటీ వ్యూహాలను..లెక్కలను అంతా సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి తొలుత ఆయన పోటీ చేస్తారనే ప్రచారం సాగినా.. బీజేపీ నుంచి పోటీ చేస్తే ఏపీలో ఇతర పార్టీల మద్దతు కుదిరే పని కాదు.

    వైసీపీ వర్సెస్ రఘురామ పోటీగా మార్చే వ్యూహం

    వైసీపీ వర్సెస్ రఘురామ పోటీగా మార్చే వ్యూహం

    స్వతంత్రంగా పోటీ చేస్తే టీడీపీ..బీజేపీ..జనసేన మద్దతు లభించటం పైన హామీ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే అమరావతి నినాదంతో ముందుకు కదులుతున్నారు. అమరావతి కోసం అన్ని పార్టీలో ఒకే తాటి పైకి రావటం కోసం ఈ నినాదం వేదిక కానుంది. ఇటు చంద్రబాబు.. అటు రఘురామ ఇద్దరూ కొద్ది రోజులుగా ఒకే నినాదం తీసుకొస్తున్నారు. జగన్ ను ఎదుర్కోవటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే రఘురామ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే ఈ మూడు పార్టీలు పోటీ పెట్టకుండా ఆ పోరు రఘురామ వర్సెస్ వైసీపీ పోరుగా మార్చాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ వ్యూహంలో కొన్ని మార్పులు చేసుకున్నట్లు సమాచారం.

    జనసేన నుంచి పోటీతో మేలనే అభిప్రాయం

    జనసేన నుంచి పోటీతో మేలనే అభిప్రాయం

    వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తరువాత జనసేనలో చేరే అవకాశం పైన చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జనసేన - బీజేపీ మిత్రపక్షాలుగా ఉండటంతో బీజేపీ కంటే జనసేన అభ్యర్ధిగా బరిలో దిగితే మరింతగా రాజకీయ సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. నర్సాపురం నియోజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలు.. ఓట్ షేర్ ను పరిగణలోకి తీసుకున్న తరువాత కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం జనసేన నుంచి పోటీ చేయటం సరైన వ్యూహంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో కాపు వర్గ మద్దతు .. మరో ప్రధాన వర్గంగా ఉన్న క్షత్రియ వర్గం ఓట్లు తమకే పోల్ అవుతాయని రఘురామ వర్గం అంచనా వేస్తోంది.

    సామాజికంగానూ కలిసి వస్తుందనే అంచనాతో

    సామాజికంగానూ కలిసి వస్తుందనే అంచనాతో

    మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా కొంత కాలంగా సాగుతున్న పోరును అక్కడ తమకు అనుకూలంగా మలచుకోవాలనే వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. నర్సాపురంలో గతంలో జనసేన అభ్యర్ధిగా మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయగా..రెండున్నార లక్షల ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి బలమైన ఓటింగ్ ఉంది. గతంలో బీజేపీ రెండు సార్లు గెలిచింది. దీంతో..జనసేన నుంచి పోటీ చేయటం ద్వారా బీజేపీ మద్దతు.. ఎలాగో టీడీపీ మద్దతు లభించటంతో తన గెలుపు సులువు అవుతుందని రఘురామ అంచనాగా తెలుస్తోంది. కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇక, వైసీపీ నుంచి ఎవరు బరిలోకి దిగినా... జనసేన అభ్యర్ధిగా పోటీలో ఉంటే... పార్టీలు - సామాజిక వర్గాలు కలిస్తే తన గెలుపు సునాయాసమమని రఘురామ భావిస్తున్నారు.

    జగన్ వ్యూహం ఏంటి.. ఎలా తిప్పికొడతారు

    జగన్ వ్యూహం ఏంటి.. ఎలా తిప్పికొడతారు

    అందులో భాగంగానే.. అన్ని పార్టీలు... అన్ని వర్గాలు తనకు సహకరించాలని పదే పదే కోరుతున్నారు. 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ నే గెలుస్తూ వచ్చింది. ఇక, ఇప్పుడు తాజాగా రఘురామ సైతం తాను పవన్ కల్యాణ్ అభిమాని అని చెప్పారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో..జగన్ ను దెబ్బ తీయటానికి ఈ పార్టీలన్నీ నర్సాపురం వేదికగా ఒక్కటై..జగన్ పైన రాజకీయ యుద్దానికి సిద్దం అవుతున్నారు. మరి..జగన్ దీనిని ఎలా ఎదుర్కొంటారో ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారో అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+