వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ కార్డ్ లేని బాబు సీఎం ఎలా?: రఘువీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు కార్డు లేని చంద్రబాబు సీఎంగా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఏపీలో ఆధార్ కార్డు లేదంటూ పింఛన్లు ఆపుతున్నారని ధ్వజమెత్తారు.

Raghuveera questiones Chandrababu Naidu

భూమి ఇస్తే స్థానిక ఆస్తుల విలువ పెరుగుతుంది: కోడెల

రాజధానికి భూమి ఇస్తే స్థానికంగా ఆస్తుల విలువ పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా దొంపాడులో జరిగిన భూసమీకరణ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన ప్రజల అవసరాలు చూడటం తన విధి అన్నారు.

అందుకే వచ్చినట్లు చెప్పారు. రాజధానికి తన 16 ఎకరాల భూమిని ఇస్తానని దొండపాడు సర్పంచ్ శివయ్య సభలో ప్రకటించారు. భూమి ఇచ్చేందుకు ఊళ్లోని 40 శాతం రైతులు సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే అరవై శాతం మంది ఉన్న కూలిల గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు జిల్లాలోని దొండపాడు గ్రామస్థులు అంగీకారం తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేబినెట్‌ సబ్‌ కమిటీకి రైతులు అంగీకార పత్రం అందజేశారు. అంతకుముందు భూములు ఇవ్వడం పట్ల తమకున్న సందేహాలను సబ్‌కమిటీ సభ్యులతో నివృత్తి చేసుకున్న రైతులు తమ డిమాండ్లను కమిటీ ముందుంచారు. గ్రామస్థులు కోరిన డిమాండ్లను దాదాపు అంగీకరించిన మంత్రివర్గ సభ్యులు కొన్ని డిమాండ్లను మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈనెల 16న ఏపీలో సచిన్‌ పర్యటన

మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ ఈనెల 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. తాను దత్తత తీసుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్రంరాజుగారి కండ్రిగ గ్రామాన్ని ఆయన సందర్శించనున్నారు. గ్రామంలోని అభివృద్ధి పనులను సచిన్‌ పరిశీలించనున్నారు.

English summary
APCC chief Raghuveera Reddy questiones AP Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X