'నమ్మొచ్చా, మోడీ మోసం చేశారని చెప్పే దమ్ము జగన్‌కు ఉందా, బాబు వేస్ట్ ఫెలో'

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో నిర్వహిస్తున్న యువభేరీ ప్రత్యేక హోదా కోసమా రాజకీయం కోసమా చెప్పాలని కాంగ్రెస్ నిలదీసింది.

'జగన్! రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఎలా ఇచ్చావ్? మమ్మల్ని అంటావా'

మంగళవారం అనంతపురంలో జగన్ యువభేరీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జగన్‌పై ప్రశ్నలతో పాటు సూచనలు చేసింది. యువభేరిలో ప్రత్యేక హోదాపై జగన్‌ మాట్లాడాలని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి డిమాండ్‌ చేశారు.

 ఎందుకో చెప్పాలి

ఎందుకో చెప్పాలి

మంగళవారం నిర్వహించే యువభేరి లక్ష్యం ప్రత్యేక హోదా సాధించడానికా? రాజకీయం చేసుకోవడానికా చెప్పాలని జగన్‌ను రఘువీరా నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పిన జగన్‌ స్వప్రయోజనాల కోసం దానిని తాకట్టు పెట్టారన్నారు.

 వ్యక్తిగత స్వార్థం కోసం బీజేపీకి మద్దతిచ్చావ్, ఎందుకో చెప్పాలి

వ్యక్తిగత స్వార్థం కోసం బీజేపీకి మద్దతిచ్చావ్, ఎందుకో చెప్పాలి

వ్యక్తిగత స్వార్థం కోసం లౌక్యం, దౌత్యంతో మోడీ, బీజేపీకి బేషరతుగా మద్దతిచ్చిన జగన్‌ హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా ఎందుకు చేయించలేదో అనంతపురం సభలో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

 మోడీతో కుమ్మక్కై హోదా అంటే నమ్మాలా

మోడీతో కుమ్మక్కై హోదా అంటే నమ్మాలా

మాట తప్పను మడమ తిప్పను, జూన్‌లో ఎంపీల రాజీనామా అని జగన్ చెప్పారని, కానీ అక్టోబరు వచ్చినా రాజీనామాలు ఏమయ్యాయో చెప్పాలని రఘువీరా నిలదీశారు. ఒకవైపు మోడీతో కుమ్మక్కై మరోవైపు హోదా కోసం యువభేరి అంటే నమ్మాలా అని నిలదీశారు.

 మోడీ మోసం చేశారని చెప్పే దమ్ముందా?

మోడీ మోసం చేశారని చెప్పే దమ్ముందా?

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ, బీజేపీ ద్రోహం చేశారని చెప్పే దమ్ము జగన్‌కు ఉందా అని నిలదీశారు. ఏ రోజైతే బీజేపీకి సంపూర్ణ మద్దతు పలికావో ఆ రోజే బీజేపీ-టీడీపీ ద్రోహంలో భాగస్వామి అయ్యావని మండిపడ్డారు. హోదా విషయంలో ఈ మూడు పార్టీలూ మూకుమ్మడిగా ప్రజలకు ద్రోహం చేశాయన్నారు.

 ప్రాజెక్టులో చంద్రబాబు బినామీలు

ప్రాజెక్టులో చంద్రబాబు బినామీలు

పోలవరం ప్రాజెక్టును 2019నాటికి పూర్తి చేయకపోతే ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు ఉండదని రఘువీరా అన్నారు. ప్రాజెక్టును కాంగ్రెస్‌ తరపున సందర్శించి అక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రజల ముందుంచుతామన్నారు. ఆ ప్రాజెక్టులో పని చేసిన కాంట్రాక్టర్లందరూ చంద్రబాబు బినామీలేనని విమర్శించారు. సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం కోర్టునే తప్పుదోవ పట్టించిందన్నారు. చంద్రబాబు వేస్ట్‌ ఫెలో అని రఘువీరా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
APCC chief Raghuveera Reddy on Monday challenged YSR Congress Party chief YS Jaganmohan Reddy over Special Status issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి