సంచలనం: 'ఆయన ఒక్క సంతకం చేస్తే, చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం'
విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విశాఖపట్నంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్ధత వల్లే తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడతున్నారని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఆ కేసుకు భయపడే తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై మాట్లాడటం లేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సంతకం పెడితే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని సంచనల వ్యాఖ్యాలు చేశారు.

బాబు అసమర్థతను అలుసుగా తీసుకుని కేసీఆర్ చెలరేగిపోతున్నారనీ, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలసి పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం చంద్రబాబు విఫలమై, ప్రజానమ్మక ద్రోహిగా మారారని విమర్శించారు.
శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరిలో ఆయన రైతు కరువు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాత్రికి విజయనగరం జిల్లా గుంకలాం గ్రామాన్ని సందర్శించారు. ఆయా సందర్భాల్లో రైతులనుద్దేశించి, విలేరులతోను ఆయన మాట్లాడారు. శనివారం ఉదయం విశాఖపట్నంలోనూ మీడియాతో ముచ్చటిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications