భళా చంద్రబాబు: 'ఒక రాజధానికి మూడు శంకుస్థాపనలు'
అమరావతి: ఒక రాజధానికి మూడు శంకుస్థాపనలు చేసిన ఘనత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నవ్యాంధ్ర నూతన రాజధానికి చంద్రబాబు నాయుడు ఒకసారి, ప్రధాని మోడీ మరోసారి, మళ్లీ చంద్రబాబు మూడోసారి శంకుస్థాపన చేశారని అన్నారు. రాష్ట్రం విడిపోయి రెండేళ్లు పూర్తి కావస్తున్నా రాజధానిలో ఎలాంటి చేపట్టకుండా ఇప్పుడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి 40 వేల కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు 1500 కోట్ల రూపాయలు అడిగితే కేంద్రం 200 కోట్ల రూపాయలు భిక్షమేసిందని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి పూర్తి నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు.
పేద వాడి నోట్లో మట్టి కొట్టి నిర్మించే రాజధాని వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. హోదా విషయమై కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు దృష్టి మళ్ళిస్తున్నారన్నారు.
అధికారంలో ఉన్న తెలుగుదేశం, ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. తొలుత మోపిదేవి వార్పు నుండి పులిగడ్డ వరకు నిర్వహించిన పాదయాత్రలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications