పవన్ కల్యాణ్ ఫోన్‌కు రఘువీరా నో రెస్పాన్స్: ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి నుంచి వ్యతిరేకత ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన సాయపై చర్చించడానికి పవన్ కల్యాణ్ రఘువీరా రెడ్డికి ఫోన్ చేసినట్లు సమాచారం.

  Pawan Kalyan, Undavalli and JP Combo : Kathi Mahesh cheap comments

  కేంద్ర సాయంపై సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుకు పవన్ కల్యాణ్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్‌తోనూ లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణతోనూ చర్చలు జరిపారు..

   రఘువీరా పుట్టిన రోజు కావడంతో...

  రఘువీరా పుట్టిన రోజు కావడంతో...

  అయితే, పవన్ కల్యాణ్ కాల్‌కు రఘువీరా రెడ్డి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. సోమవారంనాడు రఘువీరా రెడ్డి పుట్టిన రోజు. దాంతో ఆయన కుటుంబ సభ్యులతో తప్ప ఎవరితోనూ మాట్లాడరని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు.

  సతీమణికి ఫోన్ చేశారు...

  సతీమణికి ఫోన్ చేశారు...

  రఘువీరారెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో పవన్ కల్యాణ్ ఆయన సతీమణి సునీతకు ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, మరో రోజు మాట్లాడాలని ఆమె పవన్ కల్యాణ్‌తో చెప్పినట్లు తెలుస్తోంది.

   అదేనా, ఇంకేమైనా ఉందా...

  అదేనా, ఇంకేమైనా ఉందా...

  పుట్టిన రోజు కావడం వల్లనే రఘువీరా రెడ్డి పవన్ కల్యాణ్ ఫోన్‌కు స్పందించలేదా, అందుకు మరేదైనా కారణం ఉందా ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడానికి బదులు కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత తీసుకుంది, ఎవర మాటల్లో ఎంత నిజం ఉంది అనే చర్చ అనవసరమనే ఉద్దేశంతో రఘువీరా రెడ్డి ఉండవచ్చునని అంటున్నారు.

   జగన్ మాత్రం ఎదుర్కోవడానికే...

  జగన్ మాత్రం ఎదుర్కోవడానికే...

  తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోవడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డ సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. నిజ నిర్ధారణ కమిటీ వేసి, వాస్తవాలు తేల్చాలనే పవన్ కల్యాణ్ ఉద్దేశం కాలయాపన చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయపడాలనే వ్యూహంతోనే పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆయన భావిస్తున్నట్ల సమాచారం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Congress president Raguveera Reddy has not responded to Jana Sena chief Pawan Kalyan's phone call.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి