వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌కు రాహుల్ నివాళి: మొక్క నాటారు, చెక్కుల పంపణీ, చిరు ఏమన్నారు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర కోసం అనంతపురం చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు.

* రాహుల్ పాదయాత్ర డబురవారిపల్లికి చేరుకుంది. ఈ గ్రామంలో రాహుల్ గాంధీ డ్వాక్రా సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

* రాహుల పాద యాత్ర కొనసాగుతోంది.

* మామిళకుంటుపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి కుటుంబాన్ని రాహుల్‌ పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

* హరినాథరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి రూ. 50వేల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. రాహుల్ గాంధీ వెంట కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి తదితరులు ఉన్నారు.

ఓడీసీకి చేరుకున్న రాహుల్ గాంధీ:

* ఓడీసీలోని జీవన్ జ్యోతీ స్కూల్లో చిన్నారులతో రాహుల్ కాసేపు ముచ్చటించారు. రాహుల్ రాకను పురస్కరించుకుని చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు.

ఓబులదేవర చెరువుకు చేరుకున్న రాహుల్ గాంధీ:

* చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన పుష్పలతను రాహుల్ గాంధీ ఓదార్చారు.

* ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 50వేల చొప్పున చెక్‌లను రాహుల్ గాంధీ చేతుల మీదగా అందజేశారు.

* ఓబులదేవర చెరువు గ్రామంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసి నివాళులర్పించారు.

* రైతు భరోసా యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఓబులదేవర చెరువుకు చేరుకున్నారు. ఓబులదేవర చెరువు గ్రామంలో మొక్కను నాటారు. గతంలో ఇందిరా గాంధీ ఇక్కడే బహిరంగ సభ నిర్వహించారు.

* ఓబులదేవర చెరువు నుంచి మామిళ్ల కుంట వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు.

రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే: చిరంజీవి

చిరంజీవి మాట్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించి ఆత్మస్థైర్యం నింపేందుకే రాహుల్‌గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారని అన్నారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రారంభానికి ముందు చిరంజీవి విలేఖరులతో మాట్లాడారు.

* శుక్రవారం ఉదయం బెంగుళూరు నుంచి ఆయన కొడికొండ చేరుకున్నారు. ఈ క్రమంలో కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు.

* రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

* రాహుల్ తన పాదయాత్రలో ఆత్మహత్యలు చేసుకున్న 63 మంది రైతుల కుటుంబాలను కలసి.. వారితో మాట్లాడతారు. అధైర్యపడొద్దు తామున్నామంటూ భరోసా ఇస్తారు.

* అలాగే.. రైతులు, ఉపాధి కూలీలు, మహిళా సంఘాలతోనే తన యాత్రను పరిమితం చేయకుండా.. విద్యార్ధులతోనూ సమావేశం కానున్నారు.

రాహల్ గాంధీ షెడ్యూల్ ఇదీ:

* ఉదయం 8.05 గంటలకు ఓబులదేవర చెరువు నుంచి మామిళకంటపల్లి వరకూ 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

* ఇందిరాగాంధీ వేదిక నుంచి చేపట్టే ఈ యాత్రను అంబేద్కర్‌కు పూలమాలను వేయడంతో ప్రారంభిస్తారు. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళిని అర్పిస్తారు.

* పాదయాత్రలో భాగంగా ఒకే వేదికపై.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను, నేత కార్మికుల కుటుంబాలతో భేటీ అవుతారు. ఇదే సమయంలో విద్యార్థులతో పది నిమిషాలపాటు వేరుగా సమావేశమవుతారు.

* 9.45 గంటలకు మామిళకుంటుపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హరినాథరెడ్డి కుటుంబాన్ని రాహుల్‌ కలుస్తారు.

* 11 గంటలకు డబురవారిపల్లికి చేరుకొని డ్వాక్రా గ్రూపు సభ్యులతో సమావేశమవుతారు.

* మధ్యాహ్నాం 12.30 గంటలకు డొంకరమర్లకు వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడుతారు.

* ఆ తర్వాత అక్కడి నుంచి వాహనంలో బయుల్దేరి పుట్టపర్తికి చేరుకుంటారు. స్ధానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

* పుట్టపర్తి సాయిబాబా మహాసమాధిని దర్శించుకుంటారు. ఓబురదేవర చేరువు నుంచి కొండకమర్ల గ్రామం వరకు రాహుల్ గాందీ దాదాపు 10 కిలోమీటర్లు నడవనున్నారు.

* రాహుల్‌ యాత్రలో అహ్మద్‌ పటేల్‌, దిగ్విజయ్‌ సింగ్‌తోపాటు ఏపీ, తెలంగాణ పీసీసీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనాయకులు భాగస్వాములు కానున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.

* ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు చిరంజీవి, సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పళ్లంరాజు, కిల్లి కృపారాణి, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు ఓడీసీ చేరుకున్నారు.

* రాహుల్‌ పాదయాత్ర కోసం చేసిన ఏర్పాట్లను.. ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పలరాజు, రాహుల్‌ వ్యక్తిగత కార్యదర్శి భయజూ తదితరులు గురువారం పర్యవేక్షించారు.

English summary
Rahul Gandhi in ananthapuram tdp alleged rahul go back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X