నా చెల్లి షర్మిల పార్లమెంట్ లో ఉండాలి.. వైఎస్ నాన్నకు ఫ్రెండ్-రాహుల్ ఎమోషనల్..!
ఏపీలో ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగుస్తున్న నేపథ్యంలో చివరి రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపకు వచ్చారు.కడప లోక్ సభ స్ధానంలో పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ రష్మిలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ను సందర్శించిన రాహుల్... అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్సార్ ను గుర్తుచేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
షర్మిల తన చెల్లి , వైఎస్సార్ కి జోహార్ అంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభించారు. రాజకీయాల్లో కుటుంబ సంబంధాలు ఉంటాయని, వైఎస్సార్ తన తండ్రికి సోదరుడని తెలిపారు. రాజీవ్, వైఎస్సార్ ఇద్దరు ఆన్న తమ్ముళ్లున్నారు.ఈ బంధం చాలా ఏళ్ళ క్రితం నుంచే ఉందన్నారు. వైఎస్సార్ దేశానికి మార్గదర్శకుడని కూడా రాహుల్ తెలిపారు. వైఎస్సార్ పాదయాత్ర తనకు ఆదర్శమన్నారు. తన జోడో యాత్రను గుర్తుచేశారు.

వైఎస్సార్ తనను దేశం మొత్తం పాదయాత్ర చేయాలని చెప్పారని, తనకు అన్ని విషయాల్లో మార్గదర్శకుడిగా ఉన్నారని రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి వెళ్తాం అని వైఎస్సార్ తనకు చెప్పారన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. భారత్ జోడో ద్వారా ఈ దేశపు వీదులు తిరిగానన్నారు. వైఎస్సార్ సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఏపీలో అది లేదన్నారు.
ఇప్పుడు మార్పు రాజకీయాలు నడుస్తున్నాయని, వైఎస్సార్ ఢిల్లీలో ఏపీ హక్కులపై పోరాటం చేసే వాళ్ళని రాహుల్ గుర్తుచేశారు. ఇవాళ ఏపీని బీజేపీ బీటీమ్ (వైసీపీ) నడిపిస్తోందన్నారు. బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ అన్నారు. వీళ్ళ రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ చేతిలో ఉందన్నారు. మోడీ చేతిలో సీబీఐ ఉంది, ఈడీ ఉందని, అందుకే వీళ్లు ఆయన చెప్పుచేతల్లో నడుస్తున్నారని రాహుల్ ఆక్షేపించారు..
వైఎస్సార్ సిద్ధాంతం, కాంగ్రెస్ సిద్ధాంతం బీజేపీకి వ్యతిరేకమని రాహుల్ గాంధీ తెలిపారు. జగన్ మాత్రం బీజేపీ కి మద్దతుగా ఉన్నారన్నారు. బీజేపీని జగన్ ఒక్క మాట అనరన్నారు. అవినీతి బయట పడుతుంది అని భయమన్నారు. ఇదే భయం చంద్రబాబుకీ ఉందన్నారు. ఏపీ హక్కులు డిల్లీలో వినపడాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. ఏపీ విభజన అయ్యాక బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు.
Jan Nayak Rahul Gandhi Ji will campaign for Andhra Pradesh Congress chief and the candidate from Kadapa Parliamentary constituency @realyssharmila Garu.
— Shantanu (@shaandelhite) May 11, 2024
pic.twitter.com/wO8lCt4D8w
ప్రత్యేక హోదా వచ్చిందా, పోలవరం కట్టారా, కడప స్టీల్ కట్టారా అని రాహుల్ ప్రశ్నించారు. బీజేపీ ముందు ఏపి ఆత్మ గౌరవం తల దించుకొని ఉందన్నారు. ఏపిలో అవినీతి సర్కార్ నడుస్తుందన్నారు. 2014 లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే అన్ని హామీలు నెరవేరేవన్నారు. 2024 లో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తామన్నారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు కడతామని, కడప స్టీల్ ప్లాంట్ కూడా నిర్మిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు.
కాంగ్రెస్, వైఎస్సార్ ఒక్కటేనని, ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ వైఎస్సార్ ఆలోచనలకు భిన్నంగా ఉండదన్నారు. సీబీఐ ఛార్జిషీట్ లో వైఎస్ పేరును కాంగ్రెస్ చేర్చలేదన్నారు. వైఎస్సార్ మా వాడని, వైఎస్ బిడ్డ షర్మిల తన చెల్లెలని రాహుల్ తెలిపారు. నా చెల్లి షర్మిల పార్లమెంట్ లో ఉండాలన్నారు. వైఎస్ సైద్దాంతిక విలువలు షర్మిలలో ఉన్నాయన్నారు. కాబట్టి ఏపీ ప్రజల ఆలోచనలు పార్లమెంట్ లో వినిపించాలంటే షర్మిలను గెలిపించాలన్నారు
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications