చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌లోకి రంగం సిద్ధం.. ఇదీ మీ పదవి!: కిరణ్ రెడ్డికి రాహుల్‌గాంధీ సందేశం, టీఎస్సార్ భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి బుధవారం కలిశారు. ఇరువురు నేతలు దాదాపు అరగంటకు పైగా చర్చించారు. భేటీ అనంతరం టీ సుబ్బిరామి రెడ్డి తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలు ఇచ్చారు.

ఆయన చేరిక దాదాపు ఖాయమైందని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే అధిష్టానాన్ని కలుస్తారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు జాతీయస్థాయిలో సముచితస్థానం పార్టీలో ఉంటుందని చెప్పారు. ఆయనకు ఆ గౌరవం ఉంటుందని తెలిపారు.

ఊమెన్ చాందినీనే కలుస్తా: పళ్లంరాజుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిఊమెన్ చాందినీనే కలుస్తా: పళ్లంరాజుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్‌లో చేరితే కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే పదవి ఏమిటంటే?

కాంగ్రెస్‌లో చేరితే కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే పదవి ఏమిటంటే?

కిరణ్ కుమార్ రెడ్డి వేరే రాష్ట్రాల్లో జనరల్ సెక్రటరీ స్థాయి పదవులకు అర్హులు అని టీ సుబ్బిరామి రెడ్డి చెప్పారు. అధిష్టానం నుంచి వచ్చిన సందేశాన్ని తాను కిరణ్ రెడ్డికి తెలిపానని చెప్పారు. త్వరలోనే ఆయన పార్టీలో చేరుతారని చెప్పారు. దాదాపు ఖరారైనట్లే అన్నారు. త్వరలో అధిష్టానాన్ని కలుస్తారని చెప్పారు. కాగా, మంగళవారం పళ్లం రాజు.. కిరణ్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.

పార్టీ ఇంచార్జీతో మాట్లాడుతానని నిన్ననే చెప్పారు

పార్టీ ఇంచార్జీతో మాట్లాడుతానని నిన్ననే చెప్పారు

కాగా, కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్లను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించాలని ఆ పార్టీ నేతలు ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో కిరణ్ రెడ్డి నివాసానికి వెళ్లిన పల్లంరాజు ఈ మేరకు ఆహ్వానం పలికారు. పార్టీలోకి ఆహ్వానించగా.. తాను ఏఫీ పార్టీ ఇంచార్జ్ ఊమెన్ చాందితో మాట్లాడుతానని చెప్పారు.

ఆయన మనసులో ఏముందో చెప్పలేదు

ఆయన మనసులో ఏముందో చెప్పలేదు

తాను కిరణ్ కుమార్ రెడ్డిని తరుచూ కలుస్తుంటానని, అందులో భాగంగానే ఆయనను కలిశానని పళ్లం రాజు మంగళవారం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆయనతో అన్నానని తెలిపారు. కానీ ఆయన మనసులో ఏముందో బయటకు చెప్పలేదని అన్నారు.

రాహుల్ గాంధీ సందేశం కిరణ్ రెడ్డికి చేరవేత

రాహుల్ గాంధీ సందేశం కిరణ్ రెడ్డికి చేరవేత

కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలను తిరిగి ఆహ్వానించాలని పార్టీ ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పుడు కిరణ్ రెడ్డిని కలుస్తున్నారు. హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్‌లను కూడా కలిసే అవకాశముంది. పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సందేశాన్ని కిరణ్ రెడ్డికి నిన్న పళ్లం రాజు, నేడు (బుధవారం) టీఎస్సార్ తెలిపారు. మరోవైపు, ఊమెన్ చాందీతో కిరణ్ రెడ్డి ఇప్పటికే ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది. కిరణ్ రెడ్డి వస్తే పార్టీకి మంచిదనే అభిప్రాయం పలువురు నేతల్లో వ్యక్తమవుతుంది.

English summary
AICC president Rahul Gandhi message to Former Chief Minister Kiran Kumar Reddy. T Subbirami Reddy met Kiran Kumar Reddy on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X