గోదావరి పుష్కరాల ముహూర్తం- కేంద్రం కీలక నిర్ణయం,ఈ సారి ప్రత్యేకత..!!

మహాకుంభ మేళా జరుగుతున్న వేళ గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ప్రారంభం అవుతున్నాయి. కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పుష్కరాల కోసం వచ్చే భక్తుల కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర నిధులు
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగుల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది.

Railway allocates special funds for facilities in stations amid Godavari Pushkarams

భారీ అంచనాలు
కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ 100 కోట్ల ను పుష్కరాల కోసం ప్రకటించారు. తాజాగా రైల్వే శాఖ పుష్కరాల కు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగానే ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

నిధుల కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ - టూరిజం, దేవాదాయ అధికారులు పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష చేసారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా పుష్కర ఘాట్ల కోసం కావాల్సిన నిధుల పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. నిధుల సమీకరణ తో పాటుగా గోదావరి ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించనునున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+