Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్ళు.. శుభవార్త చెప్పిన వాల్తేరు డివిజన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తూ దూసుకుపోతుంది. అవసరమైన చోట ప్రత్యేకమైన ఏర్పాటు చేయడంతో పాటు, హాల్టింగ్ పాయింట్స్ ని కూడా పెంచుతూ పోతోంది. రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలోను, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, కొత్త రైళ్లను అందించడంలోనూ ఏపీకి ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచే కొన్ని ప్రత్యేక స్పెషల్ రైళ్లకు సంబంధించి కీలక అప్డేట్ ను ఇచ్చింది.

చర్లపల్లి - భువనేశ్వర్ న్యూ స్పెషల్ ఎక్స్ప్రెస్ దువ్వాడకు

వాల్తేరు డివిజన్ సీనియర్ డిసిఎం కే. పవన్ కుమార్ తెలిపిన మేరకు చర్లపల్లి - భువనేశ్వర్ న్యూ స్పెషల్ ఎక్స్ప్రెస్ మార్చి రెండవ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6:10 నిమిషాలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 9:15 నిమిషాలకు దువ్వాడ చేరుకుని, అక్కడ నుంచి 9:17 నిమిషాలకు బయలుదేరుతుంది.

Railway authorities plan to operate special trains via Duvvada station to manage high passenger rush

భువనేశ్వర్ న్యూ నుండి దువ్వాడ

ఈ రైలు భువనేశ్వర్ న్యూలో ప్రతిరోజు సాయంత్రం 6:30 నిమిషాలకు బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3:53 నిమిషాలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి మళ్లీ 3:55 నిమిషాలకు బయలుదేరుతుంది. ఇక ఇదే విషయాన్ని వాల్తేరు డివిజన్ సీనియర్ డిసిఎం కే. పవన్ కుమార్ తెలిపారు.

చెన్నై సెంట్రల్- బరౌని రైలు దువ్వాడకు

చెన్నై సెంట్రల్- బరౌని రైలు ఫిబ్రవరి 22వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు నడుస్తుంది. ఇది ప్రతి ఆదివారం రాత్రి 11:50 లకు చెన్నై సెంట్రల్ లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు దువ్వాడకు చేరుకుంటుంది. అక్కడి నుండి రెండు గంటల 55 నిమిషాలకు బయలుదేరి మళ్లీ బయలుదేరుతుంది.

దువ్వాడ నుండి చెన్నై సెంట్రల్- బరౌని రైలు

బరౌనీ- చెన్నై సెంట్రల్ రైలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకు బరౌనీ లో బయలుదేరి, శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల 30 నిమిషాలకు దువ్వాడ కు చేరుకుంటుంది. అక్కడనుండి తిరిగి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది.

చెన్నై- ఎగ్మోర్ సంత్రగచ్చి వీక్లీ ఎక్స్ప్రెస్ దువ్వాడకు

చెన్నై- ఎగ్మోర్ సంత్రగచ్చి వీక్లీ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు నడుస్తుంది. ఇది ప్రతి శనివారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు చెన్నై ఎగ్మోర్ లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు దువ్వాడ కు చేరుకుంటుంది. అక్కడి నుండి మళ్ళీ రెండు గంటల రెండు నిమిషాలకు బయలుదేరుతుంది.

దువ్వాడ నుండి ఎగ్మోర్ సంత్రగచ్చి- చెన్నై వీక్లీ ఎక్స్ప్రెస్

సంత్రగచ్చి నుండి చెన్నై ఎగ్మోర్ వీక్లీ ఎక్స్ప్రెస్ మార్చి రెండవ తేదీ నుంచి 16వ తేదీ వరకు నడుస్తుంది. ఇది ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సంత్రగచ్చిలో ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున ఒక గంట నలభై ఎనిమిది నిమిషాలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుండి ఒంటిగంట యాభై నిమిషాలకు బయలుదేరుతుంది.

సికింద్రాబాద్- నహర్ లగున్ ప్రత్యేక రైలు దువ్వాడకు

సికింద్రాబాద్- నహర్ లగున్ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8:30 నిమిషాలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. ఇది అదే రోజు రాత్రి 9:13 నిమిషాలకు దువ్వాడకు చేరుకొని మళ్లీ 9:15 నిమిషాలకు బయలుదేరుతుంది. నహర్ లగున్- సికింద్రాబాద్ రైలు మార్చి రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు నహర్ లగున్ లో బయలుదేరుతుంది. గురువారం ఉదయం 8:15 నిమిషాలకు దువ్వాడ చేరుకొని మళ్లీ తిరిగి 8:17 నిమిషాలకు బయలుదేరుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+