ఫలించిన ఎంపీ బాలశౌరీ కృషి.. ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..!!

కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్ లను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే అమరావతి మీదుగా రైల్వే లైన్ పనులను షరా వేగంగా చెయ్యాలని సంకల్పించిన కేంద్రం తాజాగా ఏపీ రాష్ట్రానికి మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక రైల్వే ప్రాజెక్ట్ విషయంలో రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్ కు రైల్వే బోర్డు అనుమతి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కీలకమైన రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్ కు రైల్వే బోర్డు అనుమతి తెలపటంతో తొలి అడుగుపడింది. 45.81 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన లైన్ కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో రేపల్లె బాపట్ల మధ్య కొత్త రైల్వే లైన్ వేయటం కోసం మొదటి అడుగు పడింది.

railway board said super good news to ap first step in repalle bapatla new railway line works

రేపల్లె నుంచి బాపట్లకు కొత్త లైన్ వేసేందుకు తొలి అడుగు
ఇప్పటికే మచిలీపట్నం-రేపల్లె మధ్య చేపట్టబోయే 45.30 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వేలైను పనులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే చేపట్టేందుకు ఆగస్టులో రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. ఇక ప్రస్తుతం దానికి అనుసంధానంగా రేపల్లె నుంచి బాపట్లకు కొత్త లైన్ వేసేందుకు తొలి అడుగు పడినట్లయింది.

విజయవాడతో సంబంధం లేకుండా... ప్రత్యామ్నాయ మార్గం
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ కోసం దివిసీమ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదు రుచూస్తున్నారు. ఈ నూతన మార్గం కోసం అనేక ఉద్యమాలు, ఆందోళనలు సైతం జరిగాయి. ఎట్టకేలకు ప్రజల కల నెరవేరబోతోంది. విజయవాడతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గంగా మచిలీపట్నం- రేపల్లె- బాపట్ల లైన్ మారబోతోంది. తీరప్రాంతంలో అత్యంత ముఖ్యమైన కోస్టల్ లైన్గా ఇది భవిష్య త్తులో ఉపయోగపడుతుంది. ప్రధానంగా మచిలీపట్నం పోర్టుకు సరకు రవాణాలో కీలక మార్గం కాబోతోంది. విజయవాడ మీదుగా చుట్టూతిరిగి రావాల్సిన అవసరం లేకుండా.. నేరుగా హౌరా-చెన్నై ప్రధాన రైల్వే మార్గంతో అనుసంధానం కావ డంతో 50 నుంచి 100 కిలోమీటర్ల వరకూ దూరాభారం కూడా తగ్గబోతోంది.

Balashowri

ఫలించిన ఎంపీ బాలశౌరి కృషి

మచిలీపట్నం నుంచి రేపల్లె వచ్చి బాపట్లకు వెళ్లే ఈ మార్గం భవిష్యత్తులో ఈ ప్రాంత రవా ణాలో కీలకంగా మారబోతోంది. విజయవాడ రైల్వే స్టేషన్‌పైనా ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుంది. దివిసీము చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలకు విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇది దగ్గరి మార్గం కాబోతోంది. ప్రధానంగా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడబోతోంది. రైల్వే మంత్రిని సైతం కలిసి ఈ మార్గం రూటామ్యాప్‌ను చూపించి, ఎంత అవసరం అనేది వివరించడంతో త్వరితగతిన అనుమతులు తెచ్చుకోగలిగినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు.తాను ఎన్ని కల ముందు మ్యానిఫెస్టోలోనూ రేపల్లె లైనే తొలి ప్రాధాన్యమని చెప్పినట్లు గుర్తుచేశారు. రైల్వేమంత్రిని కలిసి ఆయనను ఒప్పించగలిగినట్లు వెల్లడించారు.

తొలుత రేపల్లె వరకే అనుకున్నా...

మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30 కిలో మీటర్ల లైన్ నిర్మించాలని తొలుత ఎంపీ బాలశౌరి నేతృత్వంలో ప్రయత్నించారు. ఆ తర్వాత బాపట్ల వరకూ ఈ లైన్ ను పొడిగిస్తే.. భవిష్యత్తులో మచిలీపట్నం పోర్టుకు రాకపోకల విషయంలో అనేక ప్రయోజనాలు ఉంటాయని.. ఆలోచించి నివేదికలు రూపొం. దించారు. రైల్వే మంత్రిని కలిసి వివరించారు. దీంతో తొలుత రేపల్లె వరకూ సర్వేకు ఆదేశాలిచ్చారు. తాజాగా మరో సెక్షన్ కింద 45.81 కిలోమీటర్ల లైన్ కోసం బాపట్ల వరకూ పొడిగించేందుకు సర్వేకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+