విశాఖ ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రూటు మార్పు- సికింద్రాబాద్ స్టాపు రద్దు..!!

రైల్వే అధికారులు తెలుగు రాష్ట్రాల్లో వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తరువాత పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు - చేర్పులు చేసారు. ఇప్పటి కే పలు ప్రధాన రైళ్లను చర్లపల్లికి పరిమితం చేసారు. సికింద్రాబాద్ కు రాకపోకలు సాగించే నాలుగు ప్రధాన రైళ్లను చర్లపల్లి వరకే నడుపుతున్నారు. ఇక, ఇప్పుడు విశాఖ నుంచి లింగంపల్లికి రాకపోక లు సాగించే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సికింద్రాబాద్ లో స్టాపు ను రద్దు చేసారు.

జన్మభూమి ఇక నుంచి
రైల్వే శాఖ మరో కీలక ప్రకటన చేసింది. విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ కు సికింద్రాబాద్‌లో స్టాప్‌ను రద్దు చేశారు. ఏప్రిల్‌ 25 నుంచి ఇది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును చర్లపల్లి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ 25 నుంచి సికింద్రాబాద్‌, బేగంపేట్‌ స్టేషన్ల వైపు వెళ్లదని అధికారులు తెలిపారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య ప్రతి రోజూ నడుస్తోంది.

railway-cancels-secunderabad-stoppage-for-janmabhoomi-express-from-april-25th

సికింద్రాబాద్ స్టాపు రద్దు
చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావటంతో సికింద్రాబాద్ కు రాకపోకలు సాగించే ప్రధాన రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసారు. అందులో భాగంగా విశాఖ, చెన్నై నుంచి పలు రైళ్లల్లో ఈ కొత్త నిర్ణయాలు అమల్లోకి తెస్తున్నారు. ఇక.. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ కు డిమాండ్ పెరుగుతోంది. ఈ రైలుకు కొద్ది రోజుల క్రితం కోచ్ ల సంఖ్య పెంచారు. ఇంకా రద్దీ కొనసాగుతోంది. ఈ రైలు నిత్యం ఆలస్యంగా నడుస్తుండటం పైన ప్రయాణీకుల్లో అసహనం కనిపిస్తోంది. ఈ వందేభారత్ కోసం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+