రైల్లో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉద్యోగి, అరెస్ట్

దీంతో వారు అతనికి దేహశుద్ధి చేశారు. రైలు సికింద్రాబాదుకు చేరుకున్నాక పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మద్యం తాగినట్లు నిర్ధారణ చేసుకొని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
20 ప్రయివేటు బస్సులు సీజ్
ప్రయివేటు ట్రావెల్స్ పైన రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఏ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాదులోని రాజేంద్రనగర్ ఓల్డ్ కర్నూలు రహదారిపై తెల్లవారుజామున అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇరవై బస్సులపై కేసు నమోదు చేశారు.
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం సమీపంలో బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు అగ్నికి ఆహుతై 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్రయివేటు వాహనాల పైన ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications