Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

వేసవి ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించారు. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. తొలి రైలు ఆదివారం పట్టాలెక్కనుంది. ఈ నెల 29వ వ తేదీ వరకు అవి అందుబాటులో ఉంటాయి. బెంగళూరు, మైసూరు నుండి వివిధ గమ్యస్థానాల మధ్య నడిచే ఈ రైళ్ల రాకపోకలు తేదీలు, సమయాల వివరాలను అధికారులు విడుదల చేశారు.

బెంగళూరు- బలుర్‌ఘాట్

ఈ నెల 12, 19, 26 తేదీల్లో (ఆదివారాలు) ఉదయం 8:50 నిమిషాలకు ఎస్ఎంవీటీ బెంగళూరు నుండి బయలుదేరే నంబర్ 06561 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మూడో రోజు తెల్లవారు జామున 6 గంటలకు బలుర్‌ఘాట్ కు చేరుకుంటుంది.

Railway Launches Express Special Trains to Ease Summer Rush From Bengaluru Mysuru to These Stations

ఈ నెల 15, 22, 29 తేదీల్లో (బుధవారాలు) తెల్లవారు జామున 5:15 నిమిషాలకు బలుర్‌ఘాట్ నుంచి బయలుదేరే నంబర్ 06562 ప్రత్యేక ఎక్స్ ప్రెస్ మూడో వేకువ జామున 3 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరుకు చేరుకుంటుంది.

ఈ రైలులో 2 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 5 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 13 జనరల్ సెకండ్ క్లాస్/సిట్టింగ్ చైర్ కార్ కోచ్‌లు, 2 దివ్యాంగుల సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

బెంగళూరు కంటోన్మెంట్ (09:03/09:05), కేఆర్ పురం (10:09/10:11), బంగారుపేట (11:08/11:10), కుప్పం (11:38/11:40), జోలార్‌పేట (12:40/12:45), కాట్పాడి (14:50/15:00), రేణిగుంట (17:40/17:42), నెల్లూరు (19:10/19:12), ఒంగోలు (21:10/21:20), విజయవాడ (23:53/23:55), రాజమండ్రి, సామర్లకోట (01:35/01:37), సింహాచలం నార్త్ (04:55/05:00), కొత్తవలస (05:38/05:40), విజయనగరం (06:15/06:25)లల్లో ఆగుతుంది.

శ్రీకాకుళం రోడ్ (07:33/07:35), పలాస (09:03/09:05), బరంపురం (09:58/10:00), బలుగావ్ (11:05/11:07), ఖుర్దా రోడ్ (11:35/11:45), భువనేశ్వర్ (12:10/12:15), కటక్ (12:50/12:55), జాజ్‌పూర్ కే రోడ్ (13:38/13:39), భద్రక్ (15:03/15:05), బాలాసోర్ (15:58/16:00), ఖరగ్‌పూర్ (17:40/17:50), అండూల్ (19:08/19:10), దంకుని (21:05/21:10), బర్ధమాన్ (22:00/22:03), బోల్‌పూర్ (22:44/22:45), మాల్దా టౌన్ (మంగళవారం 02:50/03:00), బునియాద్‌పూర్ (04:15/04:17) మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

మైసూరు- న్యూ జల్పాయ్ గురి

ఈ నెల 17, 24 తేదీల్లో (శుక్రవారాలు) మైసూర్ నుంచి సాయంత్రం 4:40 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06251 ప్రత్యేక రైలు మూడో రోజు సాయంత్రం 7:30 గంటలకు న్యూ జల్పాయ్ గురికి చేరుకుంటుంది.

ఈ నెల 20, 27 తేదీల్లో (సోమవారాలు) న్యూ జల్ పాయ్ గురి నుంచి సాయత్రం 4:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06562 ప్రత్యేక రైలు మూడో రోజు సాయంత్రం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుంది.

ఈ రైలులో 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కమ్ ఏసీ టూ టైర్, 2 ఏసీ త్రీ టైర్, 10 స్లీపర్ క్లాస్, 5 జనరల్ సెకండ్ క్లాస్, అలాగే 2 దివ్యాంగుల సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ఈ రైళ్లు మండ్య, మద్దూరు, కెంగేరి, కేఎస్ఆర్ బెంగళూరు, బంగారుపేట, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, బలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కే రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, అండూల్, దంకుని, బర్ధమాన్, బోల్‌పూర్, రామ్ పూర్ హట్, న్యూ ఫరక్కా, మాల్దా టౌన్, కిషన్ గంజ్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+