నరసాపురం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..!
నరసాపురం, తిరుపతి మధ్య కొత్తగా వారానికోసారి నడిచేలా ఎక్స్ ప్రెస్ రైలు ( Narasapur-Tirupati Weekly Express) నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నరసాపురం-తిరుపతి స్టేషన్ల మధ్య కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ కు సంబంధించిన ప్రారంభ తేదీ, షెడ్యూల్, స్టాప్ లు, ఇతర వివరాలను రైల్వేశాఖ విడుదల చేసింది. ఈ రైలు వల్ల గోదావరి జిల్లాలకూ, తిరుపతికీ మధ్య రాకపోకలు సాగించే భక్తులకు ఎక్కువగా ప్రయోజనం కలగబోతోంది.
నరసాపురం నుంచి తిరుపతికి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17428 ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3.50కి నరసాపురంలో బయలుదేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా మంగళవారం తెల్లవారు జామున 3.40కి తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది.

అలాగే తిరుపతి నుంచి వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 17427 ఆదివారం రాత్రి 10.20కి నరసాపురానికి బయలుదేరుతుంది. అక్కడి నుంచి రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు మీదుగా నరసాపురానికి సోమవారం ఉదయం 9.30కి చేరుకుంటుంది. ఈ రైలు మే 3న ప్రారంభం కానుంది. ఈ రెండు రైళ్లలోనూ సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.














Click it and Unblock the Notifications