ఏపీకి రైల్వే మంత్రి గుడ్ న్యూస్ - కొత్తగా ఇక నుంచి..!!

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా వేచి చూస్తున్న అంశం పైన కీలక ప్రకటన చేసారు. మచిలీపట్నం-రేపల్లె మధ్య కొత్త రైల్వే లైన్ పైన స్పష్టత ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రంలో 12 కొత్తలైన్లు, 27 డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఏపీలో కొత్త స్టేషన్లతో పాటుగా కొత్త రైళ్ల మంజూరు.. వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలు ప్రస్తుతం రైల్వే శాఖ వద్ద ప్రతిపాదనల పైనా రైల్వే శాఖ సానుకూలంగా స్పందిస్తోంది.

మచిలీపట్నం-రేపల్లె మధ్య 45.30 కిలోమీటర్ల కొత్త లైన్‌ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్‌ తయారీకోసం క్షేత్రస్థాయి సర్వే మొదలుపెట్టినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ రైల్వేలైన్‌ చాలా ముఖ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టుకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దీనికితోడు మచిలీపట్నం-నర్సాపురం మధ్య 74 కిలోమీటర్లు, రేపల్లె-బాపట్ల మధ్య 46 కిలోమీటర్ల కొత్తలైన్లు, గూడూరు-విజయవాడ మధ్య 293 కిలోమీటర్ల నాలుగో లైన్, 49 కిలోమీటర్ల పొడవైన విజయవాడ బైపాస్‌ లైన్‌(ఇందుపల్లి-దుగ్గిరాల)లకు డీపీఆర్‌ల తయారీకి అవసరమైన సర్వే చేపట్టడానికి అనుమతులు మంజూరు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు.

Railway minister Aswini Vaishnav big announcement over Machilipatnam - Repalle new line

కాగా, ఏపీకే రూ.9,417 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించినట్లు వివరించారు. విజయవాడ-తెనాలి మధ్య మూడో లైన్‌ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గుడివాడ-దుగ్గిరాల మధ్య లైన్‌ నిర్మాణంపై ప్రస్తుతం సర్వే జరుగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. గుడివాడ-భీమవరం-నర్సాపురం డబ్లింగ్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. 2009-14 మధ్యకాలంలో 363 కిలోమీటర్ల ట్రాక్‌లు కొత్తగా అందుబాటులోకి వస్తే 2014-25 మధ్యకాలంలో 1,582 కిలోమీటర్ల ట్రాక్‌లు ప్రారంభమయ్యాయని చెప్పారు. 12 కొత్తలైన్లు, 27 డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 4,498 కిలోమీటర్ల పొడవైన ఈ పనులకోసం ప్రభుత్వం రూ.70,231 కోట్లు ఖర్చుపెడుతోందని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+