బెంగళూరు వందేభారత్ కు కొత్త హాల్టింగ్స్.. ప్రయాణ వేళల్లో మార్పులు..!!
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు బెంగళూరు వందేభారత్ కు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. దీని ద్వారా భక్తులు.. ప్రయాణీకులకు ప్రయోజనం కలగనుంది. అదే విధంగా ఇతర రైళ్ల పైనా అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు.
రైల్వే అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లోనూ నిలపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును జనవరి 2వ తేదీ నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌లో రెండు నిమిషాలసేపు స్టాపింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఈ రైలు వేళలను కూడా సవరించినట్లు తెలిపారు. కలబురగి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (నం. 22231) ఉదయం 5-15 గంటలకు కలబురగిలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు చేరేది. అయితే.. ఇకపై ఈ రైలు ఉదయం 6-10 గంటలకు బయలుదేరుతుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 22232) బెంగళూరులో 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి, మునుపటి సమయంలోనే గమ్యస్థానానికి చేరనుంది.

అదే విధంగా యశ్వంతపూర్-మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్ (నం. 17212) బెంగళూరులో జనవరి 1 నుంచి మధ్యాహ్నం 1-15 గంటలకు కాకుండా 12-45 గంటలకే బయలుదేరుతుంది. ఇకపై ఈ రైలు ఉదయం 6-10 గంటలకు బయలుదేరుతుంది. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 22232) బెంగళూరులో 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి, మునుపటి సమయంలోనే గమ్యస్థానానికి చేరుతుందన్నారు. ఇదేవిధంగా యశ్వంతపూర్-మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్ (నం. 17212) బెంగళూరులో జనవరి 1 నుంచి మధ్యాహ్నం 1-15 గంటలకు కాకుండా 12-45 గంటలకే బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications