ఆర్టీసీకి శుభవార్త చెప్పిన రైల్వే.. ఆ రైల్వే వంతెనతో మామూలు పండుగ కాదు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలో కూడా రైల్వే అభివృద్ధి పనులలో భాగంగా చీపురుపల్లి రైల్వే వంతెన నిర్మాణం చేశారు. ఎంతోకాలంగా విజయనగరం జిల్లా వాసులు ఎదురుచూస్తున్న రైల్వే వంతెన నిర్మాణం ఎట్టకేలకు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చింది.
చీపురుపల్లి వద్ద నూతన రైల్వే వంతెన
గతంలో చీపురుపల్లి వద్ద ఉన్న రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో నాలుగు సంవత్సరాల క్రితం ఈ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక 2021 డిసెంబర్ నెల నుండి భారీ వాహనాలను కూడా పూర్తిగా నిషేధించారు. కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులను వేగవంతం చేసి ఈ నూతన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది.

చీపురుపల్లి వంతెన అందుబాటులో లేక ఇబ్బంది పడిన జనం
ఇంతకాలం ఈ వంతెన అందుబాటులో లేకపోవడంతో విజయనగరం జిల్లా వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. పాలకొండ విజయనగరం ప్రాంతాలను విశాఖపట్నంతో కలిపే ఈ కీలక మార్గం మూసివేత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవలసి వచ్చింది. రాజాం, చిలకపాలెం, ఉత్తరవల్లి, గరివిడి మీదుగా సుదూర మార్గాలలో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈ ఒక్క వంతెన అందుబాటులో లేని కారణంగా 40 కిలోమీటర్ల అధికంగా తిరగవలసి వచ్చింది.
డబ్బులు ఖర్చు, ప్రయాణ సమయం వృధా
దీంతో డబ్బులు అధికంగా ఖర్చవడం మాత్రమే కాకుండా సమయం కూడా బాగా వృధా అయింది. చీపురుపల్లి వంతెన మూసివేత పాలకొండ ఆర్టీసీ డిపోకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ మార్గంలో విశాఖపట్నం కి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉండేది. ప్రతిరోజు 15 నిమిషాలకు ఒక బస్సు కారణంగా 49 బస్సు సర్వీసులు ఈ మార్గంలో నడుస్తూ ఉండేవి. సుమారు రోజుకి 14 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది.
ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం
ఈ మార్గం మూసివేయడంతో అది కాస్త ఆగిపోయింది. ఇక ప్రత్యామ్నాయ మార్గాలలో కేవలం 18 బస్సులు మాత్రమే నడపడంతో ప్రయాణికులు సైతం ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. ఈ నాలుగు సంవత్సరాలలో కోట్లాది రూపాయల నష్టాన్ని ఆర్టీసీ చూసింది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా నిలిచిపోయిన రాకపోకలకు తాత్కాలికంగా అనుమతిని ఇవ్వగా ప్రయాణికులు ప్రస్తుతం కాస్త ఊరట పొందుతున్నారు.
ఒక్క చిన్న వంతెన లేక మూడు బస్సులు మారాల్సిన పరిస్థితి
ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలతో పాటు ఒడిస్సా, చత్తీస్గడ్ ప్రజలు కూడా ఈ వంతెన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉపాధి కోసం బయట నివసించే పాలకొండ వాసులు పండుగలకు సొంత ఊర్లకు వచ్చేటప్పుడు ప్రయాణ విషయంలో తీవ్ర కష్టాలను చూశారు. మూడు బస్సులను మారాల్సి వచ్చేది. నూతన వంతెన అందుబాటులోకి రావడంతో వీరందరి ప్రయాణ కష్టాలకు చెక్ పడింది.
ఆర్టీసీకి రైల్వే శుభవార్త
ప్రస్తుతం తాత్కాలికంగా ఈ వంతెనపై వాహన రవాణా కొనసాగుతుంది. అయితే దీనిని అధికారికంగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తే ఆర్టీసీ బస్సులను యధావిధిగా పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక రైల్వే నిర్మించిన చీపురుపల్లి వంతెన ఆర్టీసీకి శుభవార్త చెప్పింది.
-
ఐఆర్సీటీసీలో 3 కోట్ల ఫేక్ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications