తిరుపతి ఔరంగాబాద్ ఎక్స్ ప్రెస్ సహా 5ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆ స్టేషన్లలో హాల్టింగ్!
రైల్వే అభివృద్ధికి భారతీయ రైల్వే ఎంతగా కృషి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాజాగా భారతీయ రైల్వే మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అనేక ముఖ్యమైన ప్రాంతాలలో రైలు హాల్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి తో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో హాల్టింగ్ పాయింట్లకు అనుమతి ఇస్తున్న రైల్వే, తాజాగా అనంతపురం జిల్లా గుత్తి, తాడిపత్రి రైల్వే స్టేషన్లలో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది.
ఆ స్టేషన్ లలో హాల్టింగ్ పాయింట్లు
దీంతో అనంతపురం జిల్లా వాసులు, ఆ మార్గాలలో ప్రయాణం చేసేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే తీసుకునే నిర్ణయం ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాల్టింగ్ పాయింట్ల కోసం గుత్తి, తాడిపత్రి ప్రాంత ప్రజల విజ్ఞప్తుల మేరకు ఎంపీ తాను విశేషంగా కృషి చేసినట్టుగా తెలిపారు. రైల్వే సానుకూలంగా స్పందించి ముఖ్యమైన రైళ్లకు హాల్టింగ్ పాయింట్ ఏర్పాటు చేసిందని ఆమె పేర్కొన్నారు.

రెండు రైల్వే స్టేషన్ లలో హాల్ట్ అయ్యే రైళ్ళు
ఈ నిర్ణయం అనంతపురం పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రాబోయే రోజులలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ రెండు రైల్వేస్టేషన్లో హాల్ట్ అయ్యే రైళ్ల వివరాల్లోకి వెళితే, గుత్తి జంక్షన్లో నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ రైలు రాత్రి 10 గంటల 54 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు ఆగుతుంది.
తిరుపతి ఔరంగాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ పాయింట్
అలాగే ముంబై సిఎస్ఎంటీ నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి రెండు గంటల 14 నిమిషాల నుంచి రెండు గంటల 15 నిమిషాల వరకు ఆగుతుంది. తాడిపత్రి జంక్షన్లో ముంబై csmt నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 1 29 నుంచి 1:30 వరకు ఆగుతుంది. ఇక తిరుపతి ఔరంగాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 2 గంటల 9 నిమిషాల నుంచి 2 గంటల 10 నిముషాల వరకు ఆగుతుంది.
మరికొన్ని స్టేషన్ లపై ప్రతిపాదన.. రైల్వే ఆమోదంపై ఆశాభావం
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున 4 గంటల 39 నిమిషాల నుండి 4 గంటల 40 వరకు ఇక్కడ ఆగుతుంది. ఇక అనంతపురం, రాయలచెరువు తో పాటు మరికొన్ని స్టేషన్లలో రైళ్లను నిలుపుదల చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయని వాటికి కూడా త్వరలోనే రైల్వే శాఖ నుండి ఆముదం వస్తుందని ఆమె వెల్లడించారు.












Click it and Unblock the Notifications