General knowledge:ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవో తెలుసా?
రైల్వే అంటే రైలు పట్టాలు, రైల్వే స్టేషన్ గుర్తుకువస్తుంది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యం రావడానికి ముందు 50 వేల కిలోమీటర్ల రైల్వే లైను ఉంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపుగా 18వేల కిలోమీటర్ల ట్రాక్ ను భారతీయ రైల్వే ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థను కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. వాటిని ఇనుముతో చేస్తారు. వర్షానికి తడుస్తాయి.. ఎండకు ఎండుతాయి.. అయినా తుప్పు పట్టకుండా ఎలా ఉంటాయి? అనే సందేహం అందరినీ తొలిచేస్తుంటుంది. దాన్నిగురించి తెలుసుకుందాం..
రైల్వే వ్యవస్థలో పట్టాలదే కీలకపాత్ర. ట్రాక్ పటిష్ఠంగా ఉంటే ఎంత వేగంతోనైనా రైళ్లను నడుపుకోవచ్చు. ఇనుముతో తయారైన ఏ వస్తువైనా గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపినప్పుడు తుప్పు పడటం సహజంగా జరిగే ప్రక్రియ. ఇనుముపై ఏర్పడే తుప్పు వల్ల ఐరన్ ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. అయితే రైల్వే ట్రాకులు తుప్పు పట్టకపోవడానికి కారణమేమిటంటే.. వీటిని ప్రత్యేక రకానికి చెందిన ఉక్కుతో తయారు చేస్తారు. మాంగనీస్ స్టీల్ అని దీన్ని పిలుస్తారు.

ఇందులో 0.8% కార్బన్, 12% మాంగనీస్ ఉంటుంది. రైల్వే ట్రాక్ నిర్మాణాల్లో ఈ లోహాలుండటం వల్ల పట్టాలపై ఐరన్ ఆక్సైడ్ ఏర్పడదు. రైల్వే ట్రాకులను మనం ఉపయోగించే సాధారణ ఇనుముతో తయారుచేస్తే వర్షానికి, గాలిలోని తేమవల్ల తుప్పు పడతాయి. అప్పుడు ట్రాకులన్నీ బలహీనపడి రైలు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మాంగనీస్ స్టీల్ తో తయారుచేయడంవల్ల ఎక్కువ కాలం మన్నికతో ఉంటాయి. రైలు ప్రమాదాలను నివారిస్తాయి.

రవాణా ఛార్జీలు తక్కువగా ఉండటంవల్ల దేశంలోని కోట్లమంది ప్రజలను దూరప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే మొదటి ఆప్షన్ గా రైలుబండినే ఎంచుకుంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో అన్ని రైళ్లల్లో బయో టాయ్ లెట్లు ఏర్పాటు చేసుకుంటూ వస్తోంది. కొంతకాలానికి దగ్గర దూరం ప్రయాణించే రైలులో కూడా బయో టాయ్ లెట్స్ ఏర్పాటు చేస్తామని రైల్వే తెలిపింది.












Click it and Unblock the Notifications