వీక్లీ ప్రత్యేక రైళ్లు- ఏపీ, తెలంగాణలో హాల్ట్ స్టేషన్లు.. !!

Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్ వరకు పలు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన తేదీలు, హాల్ట్ స్టేషన్లు, టైమ్ టేబుల్, పూర్తి వివరాలను విడుదల చేశారు. తొలి రైలు ఈ నెల 18వ తేదీన పట్టాలెక్కనుంది. చివరి రైలు డిసెంబర్ 28వ తేదీన బయలుదేరి వెళ్తుంది.

Railway will operate Weekly Express Special Trains to Jaipur

ఈ నెల 18 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ప్రతి గురువారం వేకువ జామున 2:30 నిమిషాలకు కోయంబత్తూర్ నుంచి బయలుదేరే నంబర్ 06181 ప్రత్యేక రైలు మూడో రోజు మధ్యాహ్నం 1:25 నిమిషాలకు జైపూర్ కు చేరుకుంటుంది.

ఈ నెల 21 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు ప్రతి ఆదివారం రాత్రి 10:05 నిమిషాలకు జైపూర్ నుంచి బయలుదేరే నంబర్ 06182 ప్రత్యేక రైలు నాలుగో రోజు ఉదయం 8:30 గంటలకు కోయంబత్తూర్ కు చేరుకుంటుంది.

తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూల్ సిటీ, గద్వాల, మహబూబ్ నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ, హింగోళి దక్కన్, వషీం, అకోలా, మల్కాపూర్, భుసావల్, జల్గామ్, నందుర్బార్, ఉధ్నా, భరూచ్, వడోదర, గోధ్రా, రత్లాం, జూరా, మందసర్, నీమచ్, చిత్తోర్ గఢ్, చందేరియా, భిల్వారా, బిజైనగర్, నసీరాబాద్, అజ్మీర్, కిషన్ గఢ్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+