చర్లపల్లి నుంచి తిరుపతికి మరో రైలు, కొత్త రూట్ లో- స్టేషన్లు.. షెడ్యూల్..!!
తిరుపతి ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనంగా మరో కొత్త సర్వీసును చర్లపల్లి- తిరుపతి మధ్య అందుబాటులోకి తీసుకొచ్చారు. రెగ్యులర్ రైళ్లు వెళ్లే రూట్ కు భిన్నంగా కొత్త మార్గంలో ఈ రైలు నడపాలని నిర్ణయించారు. నల్గొండ- కడప మీదుగా ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ మేరకు హాల్టింగ్ స్టేషన్లతో పాటుగా షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. దీని ద్వారా కొత్త మార్గంలోనూ తిరుపతికి రైలు అందుబాటులోకి రానుంది.
తిరుపతి ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ మరో రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రెండు మార్గాల్లో తిరుపతికి హైదరాబాద్ నుంచి రైళ్లు నడుస్తున్నాయి. అందులో ప్రధానంగా పద్మావతి ఎక్స్ ప్రెస్ వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా వెళ్తే, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మహబూబ్నగర్, గుత్తి జంక్షన్ల మీదుగా తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా నారాయణాద్రి ఎక్స్ ప్రెస్, వందేభారత్ నల్లగొండ, గుంటూరు మీదుగా వెళ్తుంది. ఇప్పుడు ఈ కొత్త రైలును ఈ రెండు మార్గాల్లో కాకుండా కొత్త మార్గంలో నడపనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ రెగ్యులర్ చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈ రైలు ప్రతి గురువారం తిరుపతి నుంచి, ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి బయల్దేరుతుందని అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 07002/07031 తిరుపతి - చర్లపల్లి-తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ రెగ్యులర్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు ఇకపై ట్రైన్ నంబర్ 17443/17444 తిరుపతి - చర్లపల్లి-తిరుపతి వీక్లీఎక్స్ప్రెస్ గా కొనసాగనుంది.

నల్గొండ- కడప మీదుగా తిరుపతికి
కాగా, ట్రైన్ నంబర్ 17443 తిరుపతి టు చర్లపల్లి రైలు ప్రతి గురువారం అందుబాటులో ఉండనుంది. తొలి రైలు ఈ నెల 28న ప్రారంభం కానుంది. ప్రతీ గురువారం సాయంత్రం 4.30గంటలకు తిరుపతిలో ప్రారంభమై రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, మార్కాపురం రోడ్, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా శుక్రవారం ఉదయం 8.25గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఇక... నంబర్ 17444 చర్లపల్లి టు తిరుపతి రైలు ప్రతి శుక్రవారం ప్రయాణించనుండగా ఈ సర్వీసు ఈ నెల 29న ప్రారంభించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4.20గంటలకు చర్లపల్లి జంక్షన్లో ప్రారంభమై బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, మార్కాపురం రోడ్, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా శనివారం ఉదయం 7.30గంటలకు తిరుపతి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications