పండుగ వేళ ఈ మార్గంలో నాలుగు ప్రధాన రైళ్లు రద్దు..!!

పండుగ వేళ ప్రయాణీకులకు రైల్వే శాఖ నిర్ణయాలు అంతు చిక్కటం లేదు. ఒక వైపు పెద్ద సంఖ్య లో ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్న రైల్వే అధికారులు.. అదే సమయంలో ప్రధాన రైళ్లను రద్దు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాల పై ప్రయాణీకుల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఈ రోజు నుంచి పండుగ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ముఖ్యమైన రైళ్లన్నీ ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ఇదే సమయంలో విశాఖ - విజయవాడ రూట్ లో ప్రధానమైన నాలుగు రైళ్లను రెండు రోజులు పాటు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయించారు.

కీలకమైన రద్దీ సమయంలో విజయవాడ - విశాఖపట్నం మధ్యన రెండు రోజుల పాటు ముఖ్యమైన షెడ్యూల్‌ సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. వందే భారత్‌కు డిమాండ్‌ పెంచుకోవటంలో భాగంగానే రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌, విశాఖపట్నం మధ్య నడి చే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నంబర్‌ 20834/20833)కు 2 ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లు, 14 చైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన నాలుగు రైళ్ల స్థానంలో వందేభారత్‌ వైపు ప్రయాణికులను ఆకర్షించటం కోసం చైర్‌ కార్‌ కోచ్‌లను 18కి పెంచింది.

Railways announces Four trains cancel in Viskaha - Vijayawada route for two days

దీంతో, వందేభారత్ లో వెయిటింగ్ లిస్టు తగ్గుతోంది. కానీ, వందేభారత్ కోసం రైల్వే నిర్వహంచిన
ఆటోమేటిక్‌ సెక్షన్‌ పనులేవీ అడ్డు కాలేదు. కానీ, ఇప్పుడు ప్రయాణీకులు నిరంతరం ప్రయాణం చేసే ప్రధాన రైళ్లను ఈ రద్దీ సమయంలో రద్దు చేయటం పైన విమర్శలు మొదలయ్యాయి. ఇటు అధికారులు మాత్రం అదే సమయంలో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని జనసాధారణ్‌ రైళ్లను చర్లపల్లి - విశాఖపట్నం మధ్య నడపనున్నట్లు ప్రకటించారు.

నాలుగు రైళ్లను రద్దు చేసి, మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే ప్రకటించడం ఏంటనే ప్రశ్నలు మొదల య్యాయి. పండుగ సెలవులు మొదలైన తరువాత అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రయాణీకులకు ఏ మేర ప్రయోజనం ఉంటుందనే చర్చ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+