ఏపీ మీదుగా అహ్మదాబాద్, తిరుచిరాపల్లి, బెంగళూరుకు రెగ్యులర్ రైళ్లు: రూట్, షెడ్యూల్..!!

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న వినతుల మేరకు ఇప్పటి వరకు నడుస్తున్న రెండు ప్రధాన వీక్లీ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేస్తూ అధికారులు కీలక ప్రకటన చేసారు. ఈ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్న మార్గంలోనే ఇక రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేసారు. ఈ మేరకు షెడ్యూల్ ను ప్రకటించారు. దీనికి సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం అందు బాటులోకి వచ్చింది. దీని ద్వారా అటు గుజరాత్, ఇటు బెంగళూరుతో పాటుగా తమిళనాడు వెళ్లే ప్రయాణీకులకు వెసులు బాటు కలగనుంది.

ఏపీ ప్రజలకు రైల్వే శాఖ కీలక అప్డేట్. విజయవాడ, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్లే ట్రైన్ నంబర్ 15302/15301 లాల్ కువాన్ - కేఎస్​ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ తో పాటుగా రాయచూర్ రేణిగుంట మీదుగా తిరుచురాపల్లి వెళ్లే ట్రైన్ నంబర్ 19418/19420 అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రెండు రైళ్లు సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ సేవలు అందించనున్నాయి. ఈ మేరకు ఈ రైళ్ల రూట్, షెడ్యూల్ అధికారులు వెల్లడించారు. ట్రైన్ నంబర్ 15302 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 5.45గంటలకు లాల్ ​కువాన్​ స్టేషన్లో బయల్దేరుతుంది. కిచ్చా స్టేషన్ మీదుగా ప్రయాణించి ఆదివారం సాయంత్రం 7.19గంటలకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్​నగర్ స్టేషన్ చేరుతుంది.

 తిరుమలకు వెళ్తున్నారా, టీటీడీ కొత్త రూల్- వాటి పై బ్యాన్..!!
తిరుమలకు వెళ్తున్నారా, టీటీడీ కొత్త రూల్- వాటి పై బ్యాన్..!!
railways-announces-weekly-trains-for-banglorea-and-tiruchaplly-upgrades-as-regular-trains-schedule

రూట్ - షెడ్యూల్

అదే విధంగా అక్కడి నుంచి మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా ప్రయాణించి సోమవారం అర్ధరాత్రి 1.35గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ఉదయం 8గంటలకు రేణిగుంట జంక్షన్ చేరుతుంది. 10 నిమిషాల విరామం అనంతరం బయల్దేరి సాయంత్రం 5.25గంటలకు బెంగళూరు చేరుతుంది. ట్రైన్ నంబర్ 15301 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం 7.15గంటలకు బెంగళూరులో బయల్దేరుతుంది. మధ్యాహ్నం 1.40గంటలకు రేణిగుంట చేరుకుని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా ప్రయాణించి రాత్రి 8గంటలకు విజయవాడ జంక్షన్​ చేరుతుంది. తిరిగి అక్కడి నుంచి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్​నగర్ మీదుగా ప్రయాణించి గురువారం ఉదయం 9గంటలకు లాల్​కువాన్ స్టేషన్ చేరుతుంది.

రెండో వేసవి, మండుతున్న ఎండలు - ఉక్కపోత, తాజా హెచ్చరిక..!!
రెండో వేసవి, మండుతున్న ఎండలు - ఉక్కపోత, తాజా హెచ్చరిక..!!

ట్రైన్ నంబర్ 19419/19420 అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి రైలు ట్రైన్ నంబర్ 19419 ప్రతి గురువారం ఉదయం 9.20గంటలకు అహ్మదాబాద్​లో బయల్దేరి వడోదర మీదుగా ప్రయాణిస్తూ శుక్రవారం కృష్ణా, రాయచూర్ స్టేషన్లకు చేరుతుంది. మంత్రాలయం, ఆదోని, గుంతకల్, తాడిపత్రి, కడప మీదుగా ఉదయం 11.40గంటలకు రేణిగుంట జంక్షన్ చేరుకుంటుంది. శనివారం తెల్లవారుజామున 3.35గంటలకు తిరుచిరాపల్లి చేరుతుంది. ట్రైన్ నంబర్ 19420 ప్రతి ఆదివారం ఉదయం 5.45గంటలకు తిరుచిరాపల్లిలో బయల్దేరి సోమవారం రాత్రి 9.15గంటలకు అహ్మదాబాద్ చేరుతుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+