విశాఖ- తిరుపతి అమృత్ భారత్ కు గ్రీన్ సిగ్నల్: రూట్,షెడ్యూల్, ముహూర్తం..!!
తిరుపతి ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇస్తోంది. విశాఖ నుంచి ఎంతో కాలంగా తిరుపతి కి వందేభారత్ రైలు కేటాయించాలనే డిమాండ్ పెండింగ్ లో ఉంది. అయితే, ఈ రూట్ లో వందే భారత్ స్లీపర్ కేటాయించాలనేది రైల్వే శాఖ ఆలోచన. కాగా.. తాజాగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ వేళ.. విశాఖ- తిరుపతి మధ్య కొత్తగా పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రూట్, షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లు సమాచారం.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తక్కువ చార్జీతో వందేభారత్ తరహా సౌకర్యాలను చేరువ చేసే లక్ష్యంతో రైల్వేశాఖ కొత్తగా పలు అమృత్‌భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో నాలుగు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం పరుగులు పెడుతున్నాయి. చర్లపల్లి- తిరువనంతపురం (కేరళం), చర్లపల్లి నుంచి నాగర్‌కోయిల్(తమిళనాడు)కు, ఈ నెల 18న చర్లపల్లి నుంచి అసోం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్యకు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. కాగా, ప్రయాణీకుల నుంచి ఈ రైళ్లకు వస్తున్న వంద శాతం ఆక్యుపెన్సీ కారణంగా మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ కోసం పలు మార్లు ఎంపీలు రైల్వే శాఖను కోరారు. హామీ ఇచ్చినా ఈ మార్గంలో వందేభారత్ పట్టాలెక్కలేదు.

పెరుగుతున్న ఆదరణ.. రైల్వే శాఖ కసరత్తు
దీంతో, ఇప్పుడు కొత్తగా ఈ మార్గంలో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వైపు అధికారులు మొగ్గు చూపుతు న్నారు. తొలుత సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలనే ప్రతిపాదన చర్చకు వచ్చింది. వందేభారత్ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కొనసాగుతుంది. దీంతో, విశాఖ నుంచి నడపటం ద్వారా ప్రయోజనం ఉంటుందని.. సుదీర్ఘ కాలంగా ఆ ప్రాంత ప్రజల డిమాండ్ కొంత మేర నెరవేరుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో.. విశాఖ - తిరుపతి మార్గంలో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. హాల్టింగ్ స్టేషన్లు.. షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. రెగ్యులర్ రూటులోనే ఈ రైలు కొనసాగనుంది. మే నెల రెండో వారంలో ఈ రైలును ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. వచ్చే వారం ఈ కొత్త రైలు ప్రారంభం పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తక్కువ టికెట్ చార్జీలతో పాటు భద్రత, సౌకర్యం, వేగవంతమైన ప్రయాణ అనుభవం మధ్యతరగతి ప్రయాణికులకు అందుతోంది. దీంతో.. విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా ఈ రైలు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.
-
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
IRCTC స్పెషల్ ఆఫర్ - అరకు, విశాఖ టూర్ స్పెషల్.. ప్యాకేజీ ఇలా..!! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!













Click it and Unblock the Notifications