విజయవాడ మీదుగా బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, ముహూర్తం ఫిక్స్..!!
తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తాజాగా రైల్వే శాఖ తుది కసరత్తు చేస్తోంది. వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఇప్పటికే కొనసాగుతోంది. రెండో రైలు ముంబాయి నుంచి పుట్టపర్తి మీదుగా బెంగళూరుకు ఖరారు చేసారు. ఇదే సమయంలో విశాఖ, విజయవాడ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ ప్రకటనకు రంగం సిద్దం అయింది. రూట్, షెడ్యూల్ పైన అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు.
ఏపీ ప్రజలకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపేందుకు కసరత్తులు చేస్తోంది. విజయవాడ డివిజన్ మీదుగా ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలి స్లీపర్ రైలును ఈ ఏడాది జనవరిలో హౌరా-గువహతి మధ్య ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి వరకు, కాచిగూడ నుంచి బెంగళూరు, నర్సాపురం నుంచి చెన్నైకు రైళ్లు నడుస్తున్నాయి. కాగా.. వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రయాణీకుల నుంచి డిమాండ్ ఉంది. ఈ సమయంలో ముంబాయి నుంచి బెంగళూరుకు ప్రారంభం కానున్న వందేభారత్ స్లీపర్ రైలు ఏపీ మీదుగా నడపాలని నిర్ణయించారు. ఇందుకు రూట్ ఫిక్స్ చేసారు.

రైల్వే శాఖ తుది కసరత్తు
ఇక, విశాఖ, విజయవాడ - బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు ఎంపీలు రైల్వే శాఖకు ఈ మేరకు ప్రతిపాదనలు అందించారు. ఇదే సమయం లో విజయవాడ నుంచి అయోధ్య/ వారణాసి వరకు వందేభారత్ స్లీపర్ ప్రకటించాలని పెద్ద ఎత్తున వినతులు అందాయి. ఇక.. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి వందేభారత్ స్లీపర్ ఖరారు పైనా సానుకూల స్పందన కనిపిస్తోంది. దసరా సమయంలో ఏపీ నుంచి కొత్తగా వందేభారత్ ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల వేళ.. ఏపీ ఎంపీలు మరో సారి వందేభారత్ స్లీపర్ కోసం రైల్వే మంత్రిని కలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే.. దసరా వేళ ఒక వందేభారత్ స్లీపర్ ప్రకటన ఖాయమని తెలుస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేసిన ప్రతిపాదనల మేరకు రైల్వే శాఖ తుది నిర్ణయం వెల్లడించనుంది.












Click it and Unblock the Notifications