ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలే.. ఏపీలో వాతావరణం ఇలా!
ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మండే ఈ కాలంలో ఈ సంవత్సరం విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుంది కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా ఎండలు మరికొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కొనసాగుతున్న ఉత్తర దక్షిణ ద్రోణి
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ నుంచి మన్నారు గల్ఫ్ వరకు, రాయలసీమ, దక్షిణ తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. ఇది సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈసారి నైరుతి రుతుపవనాలు మే 12వ తేదీకి దక్షిణ అండమాన్ సముద్ర ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
ఈ క్రమంలో ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఈరోజు, రేపు, ఎల్లుండి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని imd అంచనా వేసింది.
ఈ ప్రాంతాలలో వర్షాలు .. జాగ్రత్త
మరోవైపు దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక్కడ కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఎండల విషయంలోనూ అలెర్ట్
పిడుగుపాటు పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక కొన్ని ప్రాంతాలలో ఎండ తీవ్రత పెరుగుతుందని 42 డిగ్రీల నుండి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఎండల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications