బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీకి వానగండం; ఈ ప్రాంతాల్లోనే వర్షం పడే ఛాన్స్!!
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం రేపు శ్రీలంక వద్ద తీరం తాకనుంది. దీని ప్రభావంతో దక్షిణాది జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి సోమవారం నాడు వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వైపు దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తోంది. శ్రీలంక సమీపంలోని, హిందూ మహాసముద్రం దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు ఉదయం శ్రీలంకలో తీరం దాటనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాన గండం వచ్చి పడింది.

ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ భద్రతా సూచీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దాని ప్రభావం కారణంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండి విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో మంగళవారం రోజు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక బంగాళాఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం తదితర ఓడరేవుల్లో ఒకటో నెంబర్ భద్రత హెచ్చరికను ఎగరవేశారు.

రానున్న 24గంటల్లో వర్షాలు పడే ఏపీ ప్రాంతాలు ఇవే
ఇప్పటికే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే అనేక చోట్ల వర్షాలు కురుస్తుండగా, రానున్న 24 గంటల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాతో పాటుగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో కూడా ఇప్పటికే చిన్న చిన్న వర్షాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లాలోని పలుభాగాలలో కురుస్తున్న వర్షాలు, నేడు మధ్యాహ్నం నుంచి విస్తరించి చిత్తూరు జిల్లాలోని పలు భాగాలకు చేరనుంది.

దక్షిణాది జిల్లాలలో వర్ష ప్రభావం.. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక వైపున తీరం తాకనున్న నేపథ్యంలో మనకు అంతగా ప్రభావం ఉండబోదని, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం మాత్రమే ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణాది జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాలలో తేలికపాటి వర్షాలు ఉంటాయని, ఒకటి రెండు చోట్ల మాత్రమే మోస్తరు వర్షం పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటాయని, మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ వాయుగుండం ప్రభావం పెద్దగా ఏపీ మీద ఉండబోదని, కాస్త ముసురుగా ఉంటుందని, తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలుస్తుంది.

తెలంగాణా రాష్ట్రంలో వాతావరణం ఇలా
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేటి నుంచి సాధారణంగా చలి నమోదవుతుందని, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలో చలి విషయంలో ఎల్లో అలర్ట్ రేపటినుండి జారీ అయిందని తెలుస్తోంది. నిన్నటివరకు హైదరాబాద్ ను ఊపేసిన చలి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్లో కనిష్ఠ గరిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుండి 29 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల పొగ మంచు అధికంగా ఉంటుందని, వాహనదారుల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications