వర్షాకాలం.. సూపర్ వెదర్.. ఈ బ్యూటీఫుల్ ప్లేసెస్ కు వెళ్ళండి!!
మొన్నటి వరకు ఎండాకాలం ఎండలతో పోరాడి, భానుడి దాటికి అలసిపోయి కాస్త సేద తీరాలి అనుకునేవారికి తొలకరి జల్లులు స్వాగతం పలుకుతున్నాయి. భారతదేశంలో రుతుపవనాలు ప్రవేశించటంతో దేశ ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. దేశంలోని చాలా ప్రాంతాలలో వర్షాకాలం ప్రారంభమైంది.కురుస్తున్న వర్షాలతో ప్రజలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. రైతన్నలు వ్యవసాయానికి ఉపక్రమిస్తున్నారు.
భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ సంవత్సరం రుతుపవనాల ప్రారంభం కాస్త నెమ్మదిగా ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం అది వేగంగా మారింది. దీంతో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాకాలం లో చూడవలసిన దేశంలోని బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వర్షాకాలంలో చూడవలసిన టూరిస్ట్ ప్లేస్ లో మున్నార్ ముఖ్యమైనది.

మున్నార్ లో పచ్చదనం మిమ్మల్ని ఇట్టే కట్టిపడేస్తుంది . ఇక్కడ సుందర దృశ్యాలు మనసుకు మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. మున్నార్ ప్రసిద్ధ హనీమూన్ డెస్టినేషన్ గా కూడా ఉంది. వర్షాకాలంలో చూడవలసిన మరొక బ్యూటిఫుల్ ప్లేస్ మౌంట్ అబూ. వర్షాకాలంలో రాజస్థాన్లోని మౌంట్ అబూలో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. మౌంట్ అబూ ఎత్తయిన కొండలతో పచ్చని ప్రకృతితో అలరారే ప్రదేశం. వర్షాకాలంలో ఇక్కడ సుందర దృశ్యాలు మనసును ఇట్టే హత్తుకుంటాయి.
వర్షాకాలం లో చూడదగిన మరొక బ్యూటిఫుల్ ప్రదేశం ఉత్తరాఖండ్లోని ఫ్లవర్ వ్యాలీ. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద లో చేర్చబడిన ఫ్లవర్ వ్యాలీ వర్షాకాలం లో చూడవలసిన ఒక బ్యూటిఫుల్ ప్లేస్. వర్షాకాలంలో పుష్పవతి నది ఒడ్డు ఆల్ఫైన్ పూలతో అందంగా అలంకరించినట్టు ఉంటుంది. అందుకే చాలామంది ఈ ఫ్లవర్ ర్యాలీని భూతల స్వర్గం అంటారు. కచ్చితంగా వర్షాకాలంలో ఇది మీ మనసును ఇట్టే హత్తుకుంటుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
వర్షాకాలంలో గోవా బీచ్ కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. వర్షాకాలంలో సేద తీరాలి అనుకునేవారికి గోవా మంచి డెస్టినేషన్ పాయింట్. సముద్రతీర రాష్ట్రమైన గోవాలో వర్షాకాలంలో ప్రకృతి కనువిందు చేస్తుంది. ఇక్కడి బీచ్ తో పాటు అనేక సుందర ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పరుగుల జీవితంలో అలసిపోయి సేద దీరాలి అనుకునే వారు మరెందుకాలస్యం మీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.












Click it and Unblock the Notifications